ప్రణబ్ హెల్త్ ఇప్పుడు ఓకే

కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి, భారత రత్న గ్రహీత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడుతోందని, ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన కుమారుడు అభిజిత్ బెనర్జీ వెల్లడించారు. ప్రణబ్ ముఖర్జీ క్లినికల్ ప్యారామీటర్స్ నిలకడగా ఉన్నాయని చికిత్సనందిస్తున్న ఆర్మీ రీసెర్చ్, రిఫరల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. వెంటిలేటర్ సపోర్టుపైనే ప్రణబ్‌కు చికిత్సనందిస్తున్నట్టు వెల్లడించింది. రక్తనాళాల్లో క్లాట్‌ను తొలగించడానికి ఈ నెల 10న అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని టెస్టులో తేలింది. అప్పటి […]

Update: 2020-08-16 03:07 GMT

కోల్‌కతా: మాజీ రాష్ట్రపతి, భారత రత్న గ్రహీత ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం కుదుటపడుతోందని, ప్రస్తుతం ఆయన చికిత్సకు స్పందిస్తున్నారని ఆయన కుమారుడు అభిజిత్ బెనర్జీ వెల్లడించారు.

ప్రణబ్ ముఖర్జీ క్లినికల్ ప్యారామీటర్స్ నిలకడగా ఉన్నాయని చికిత్సనందిస్తున్న ఆర్మీ రీసెర్చ్, రిఫరల్ ఆసుపత్రి కూడా ప్రకటించింది. వెంటిలేటర్ సపోర్టుపైనే ప్రణబ్‌కు చికిత్సనందిస్తున్నట్టు వెల్లడించింది. రక్తనాళాల్లో క్లాట్‌ను తొలగించడానికి ఈ నెల 10న అతనికి బ్రెయిన్ సర్జరీ చేశారు. అనంతరం అతనికి కరోనా పాజిటివ్ అని టెస్టులో తేలింది. అప్పటి నుంచి ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది.

తాజాగా, అభిజిత్ బెనర్జీ ట్వీట్ చేస్తూ దేవుడి దయ, ప్రజల ఆశిస్సులతో తన తండ్రి కోలుకుంటున్నారని, ఇటీవలి రోజుల కంటే నేడు ఆయన ఆరోగ్యం మెరుగ్గా ఉన్నదని పేర్కొన్నారు. చికిత్సకు స్పందిస్తున్నారని, త్వరలోనే మన మధ్యలోకి వస్తారని ఆశిస్తున్నట్టు వివరించారు. వెంటిలేటర్‌పైనే ఉన్నప్పటికీ ముఖ్యమైన ప్యారామీటర్లు నిలకడగా ఉన్నాయని ఆసుపత్రి తెలిపింది. ఆయన ఆరోగ్యాన్ని ప్రత్యేక నిపుణులు బృందం పర్యవేక్షిస్తున్నదని పేర్కొంది.

Tags:    

Similar News