పవన్ ఆలోచనలకు తగిన సినిమా ‘వకీల్ సాబ్’ : ప్రకాష్ రాజ్
దిశ, సినిమా : ‘మహిళల గురించి మరిన్ని సినిమాలు రావాలి, పురుషుల్లో మార్పు చూడాలి’.. ఇది తనతో పాటు పవన్ కళ్యాణ్ అభిప్రాయమని నటులు ప్రకాష్ రాజ్ తెలిపారు. ‘వకీల్ సాబ్’ పవన్ ఆలోచనలకు తగిన సినిమా అని అభిప్రాయపడ్డారు. పవన్‌ను ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను అన్న ప్రకాష్ రాజ్.. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా ఇద్దరం ఒకరికొకరు గౌరవించుకుంటామన్నారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు గత చిత్రాలను గుర్తుచేసుకుంటారన్న ఆయన.. బద్రి సినిమాలో నంద క్యారెక్టర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో […]
దిశ, సినిమా : ‘మహిళల గురించి మరిన్ని సినిమాలు రావాలి, పురుషుల్లో మార్పు చూడాలి’.. ఇది తనతో పాటు పవన్ కళ్యాణ్ అభిప్రాయమని నటులు ప్రకాష్ రాజ్ తెలిపారు. ‘వకీల్ సాబ్’ పవన్ ఆలోచనలకు తగిన సినిమా అని అభిప్రాయపడ్డారు. పవన్‌ను ప్రేమిస్తాను కాబట్టే విమర్శించాను అన్న ప్రకాష్ రాజ్.. రాజకీయంగా భిన్నాభిప్రాయాలున్నా ఇద్దరం ఒకరికొకరు గౌరవించుకుంటామన్నారు. ప్రేక్షకులు సినిమా చూస్తున్నప్పుడు గత చిత్రాలను గుర్తుచేసుకుంటారన్న ఆయన.. బద్రి సినిమాలో నంద క్యారెక్టర్‌కు వచ్చిన రెస్పాన్స్‌ను దృష్టిలో ఉంచుకుని, ఈ సినిమాలో తన క్యారెక్టర్‌కు నందా జీ, నంద గోపాల్ అనే పేరు పెట్టారన్నారు. సినిమా విషయానికొస్తే భాష ఒకటే, భావం ఒకటే ఉండొచ్చు గానీ అమితాబ్ బచ్చన్ నటించినప్పుడు సినిమా మీదున్న అంచనాలు వేరు.. అదే అజిత్ తమిళ్‌లో చేసినప్పుడు తన ఇమేజ్ వేరు.. ఆ చిత్రాన్నే మూడేళ్ల తర్వాత పవన్ చేస్తే ఆ ఎక్స్‌పెక్టేషన్స్ వేరు అని వివరించారు. అందుకే పవర్ స్టార్ ఇమేజ్ ప్రకారం సినిమా తీశారని చెప్పారు. సందేశాత్మక సినిమా చేసినా.. అందులో సాంగ్స్, ఫైట్స్ కావాలని తెలిపారు.