ఆగస్టు నాటికి సాధారణ స్థాయిలో విద్యుత్ వినియోగం
దిశ, సెంట్రల్ డెస్క్: గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో విద్యుత్ వినియోగం 9.74 శాతం తగ్గి 106.48 బిలియన్ యూనిట్లుగా ఉన్నట్టు విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్-19 సంబంధిత పరిమితుల మధ్య డిమాండ్ తక్కువగా నమోదైంది. అయితే, ఏప్రిల్‌లో 23.21 శాతం క్షీణత నమోదు చేయగా, మేలో 14.86 శాతం క్షీణతతో పోలిస్తే జూన్‌లో కొంత మెరుగుపడింది. ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించిన తర్వాత విద్యుత్ వినియోగం పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి. విద్యుత్ […]
దిశ, సెంట్రల్ డెస్క్: గతేడాదితో పోలిస్తే జూన్ నెలలో విద్యుత్ వినియోగం 9.74 శాతం తగ్గి 106.48 బిలియన్ యూనిట్లుగా ఉన్నట్టు విద్యుత్ మంత్రిత్వ శాఖ వెల్లడించింది. దేశంలో కొవిడ్-19 సంబంధిత పరిమితుల మధ్య డిమాండ్ తక్కువగా నమోదైంది. అయితే, ఏప్రిల్‌లో 23.21 శాతం క్షీణత నమోదు చేయగా, మేలో 14.86 శాతం క్షీణతతో పోలిస్తే జూన్‌లో కొంత మెరుగుపడింది. ఆర్థిక కార్యకలాపాలకు ప్రభుత్వం అనుమతించిన తర్వాత విద్యుత్ వినియోగం పెరిగిందని సంబంధిత వర్గాలు తెలిపాయి.
విద్యుత్ మంత్రిత్వ శాఖ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఏడాది జూన్‌లో మొత్తం విద్యుత్ వినియోగం 106.48 బిలియన్ యూనిట్లు కాగా, అంతకుముందు ఏడాది ఇదే నెలలో 117.98 బిలియన్ యూనిట్ల వినియోగం నమోదైంది. మేలో విద్యుత్ వినియోగం 102.18 బిలియన్ యూనిట్లు, ఏప్రిల్‌లో 84.55 బిలియన్ యూనిట్లుగా నమోదైనట్టు తెలుస్తోంది. మే 14 నుంచి 31 వరకు అనేక ప్రాంతాల్లో లాక్‌డౌన్ సడలింపులతో పారిశ్రామిక, వాణిజ్య కార్యకలాపాలతో విద్యుత్ డిమాండ్‌ను పెంచాయి. అలాగే, వాతావరణ పరిస్థితుల్లోనూ విద్యుత్ డిమాండ్ పెరగడానికి కారణమని గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. క్రమంగా లాక్‌డౌన్ సడలింపులతో విద్యుత్ వినియోగం పెరిగిందని, ఆగస్టు నాటికి సాధారణ స్థాయికి చేరుకోవచ్చని నిపుణులు అభిప్రాయపడ్డారు.