మా ఎంపీ స్మృతి ఇరానీ కనిపించట్లేదంటూ పోస్టర్లు
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ కనిపించట్లేదని ఆ నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆమె రెండే సార్లు అమేథీ నియోజకవర్గానికి వచ్చారని, అది కూడా కొన్ని గంటలు మాత్రమే పర్యటించారని ఆ పోస్టర్ పేర్కొంది. ఇరానీ ఫొటో ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌లో తమ ఎంపీకి అమేథీ ఒక టూరిస్టు స్పాట్‌లా మారిందని, ఇక్కడి ప్రజల సంక్షేమం ఆమెకు పట్టడం లేదని ఆరోపణలున్నాయి. ‘ట్విట్టర్‌లో […]
న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ అమేథీ ఎంపీ స్మృతి ఇరానీ కనిపించట్లేదని ఆ నియోజకవర్గంలో వెలసిన పోస్టర్లు కలకలం రేపాయి. 2019 ఎన్నికల్లో గెలిచినప్పటి నుంచి ఆమె రెండే సార్లు అమేథీ నియోజకవర్గానికి వచ్చారని, అది కూడా కొన్ని గంటలు మాత్రమే పర్యటించారని ఆ పోస్టర్ పేర్కొంది. ఇరానీ ఫొటో ఉన్న ఈ బ్లాక్ అండ్ వైట్ పోస్టర్‌లో తమ ఎంపీకి అమేథీ ఒక టూరిస్టు స్పాట్‌లా మారిందని, ఇక్కడి ప్రజల సంక్షేమం ఆమెకు పట్టడం లేదని ఆరోపణలున్నాయి. ‘ట్విట్టర్‌లో ఆమె అంతాక్షరి ఆడుతుండగా చూశాం. కొంతమందికి ఆహారం పంపిణీ చేయగా కనిపించారు. కానీ, అమేథీ ప్రజలు ఆమె చేయూతనిస్తారని ఎదురుచూస్తున్నారు. ఆమె అమేథీ ఎప్పుడు వస్తారు? ఇక్కడి ప్రజల మృతదేహాలను మోసేందుకే వస్తారా?’ అని ప్రశ్నిస్తున్న ఆ పోస్టర్‌ను కాంగ్రెస్ మహిళా విభాగం ట్విట్టర్‌లో షేర్ చేసింది. ఈ పోస్ట్‌పై కేంద్రమంత్రి స్మృతి ఇరానీ స్పందిస్తూ.. కాంగ్రెస్‌పై విమర్శలు ఎక్కుపెట్టారు. ‘నా నియోజకవర్గానికి ఎనిమిది నెలల్లో పది సార్లు వెళ్లాను. 14 రోజులు అక్కడే ఉన్నాను. మరి కాంగ్రెస్ సీనియర్ నేత సోనియా గాంధీ ఈ కాలంలో ఎన్నిసార్లు రాయ్‌బరేలీ నియోజకవర్గానికి వెళ్లారో చెప్పగలరా?’ అంటూ ప్రశ్నించారు.