పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియలో మార్పులు
న్యూఢిల్లీ: వికలాంగులు, 80ఏళ్లు పైబడిన వయోధికులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మరింత సులువు చేసే నిర్ణయాన్ని ఎన్నికల సంఘం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఎంచుకునే ఫామ్‌లను వీరికి ఎన్నికల అధికారులు ఇంటికి వచ్చి అందిస్తారు. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌వో) అవసరార్థులందరికీ ఫామ్ 12-డీని అందిస్తారు. నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు రోజుల్లో వీటిని అందించి రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. పోస్టల్ బ్యాలెట్‌లను వోటర్లకు అందించి తిరిగి కలెక్ట్ చేసుకుని రిటర్నింగ్ అధికారికి సమర్పించడానికి ప్రత్యేక పోలింగ్ బృందాలను ఏర్పాటు […]
న్యూఢిల్లీ: వికలాంగులు, 80ఏళ్లు పైబడిన వయోధికులకు పోస్టల్ బ్యాలెట్ ప్రక్రియ మరింత సులువు చేసే నిర్ణయాన్ని ఎన్నికల సంఘం తీసుకుంది. పోస్టల్ బ్యాలెట్ ఎంచుకునే ఫామ్‌లను వీరికి ఎన్నికల అధికారులు ఇంటికి వచ్చి అందిస్తారు. బూత్ లెవల్ ఆఫీసర్లు(బీఎల్‌వో) అవసరార్థులందరికీ
ఫామ్ 12-డీని అందిస్తారు.
నోటిఫికేషన్ ఇచ్చిన ఐదు రోజుల్లో వీటిని అందించి రిటర్నింగ్ అధికారికి సమర్పిస్తారు. పోస్టల్ బ్యాలెట్‌లను వోటర్లకు అందించి తిరిగి కలెక్ట్ చేసుకుని రిటర్నింగ్ అధికారికి సమర్పించడానికి ప్రత్యేక పోలింగ్ బృందాలను ఏర్పాటు చేయాల్సి ఉంటుంది. పోస్టల్ బ్యాలెట్‌ను ఎంచుకోవడం పూర్తిగా వికలాంగులు, వయోధికుల అభీష్టమే. కరోనా పేషెంట్లకూ ఈ వీలును ఈసీ కల్పించిన సంగతి తెలిసిందే. గతంలో ఆర్మీ, పోలింగ్ సేవలు అందిస్తున్న ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ సౌకర్యముండేది. ఈ సర్వీస్ వోటర్లకు వీరికి తేడా ఉంటుందని, వీరు పోస్టల్ బ్యాలెట్ కోసం ఒక ఫామ్ నింపి సమర్పిస్తేనే పోస్టల్ బ్యాలెట్‌కు అర్హత పొందుతారని వివరించారు.