సౌతాఫ్రికా టూర్‌లో సంచలనం.. క్రికెటర్లకు పాజిటివ్ వచ్చినా మ్యాచ్‌లు ఆగవు..?

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా జట్టు సౌతాఫ్రికా‌ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కోవిడ్ రూల్స్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు.. CSA చీఫ్ మెడికల్ ఆఫీసర్ షుయబ్ మంజ్రా ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు వెల్లడించినట్టు ప్రచురించింది. ‘ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ బయోబబుల్‌లో ఉంటున్నారు.. కొవిడ్ నెగెటివ్ నిర్ధారణ అనంతరమే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అందుకే ఒక హోటల్ పూర్తిగా […]

Update: 2021-12-22 09:38 GMT

దిశ, వెబ్‌డెస్క్: టీమిండియా జట్టు సౌతాఫ్రికా‌ పర్యటనలో భాగంగా మూడు టెస్టులు, మూడు వన్డేలు ఆడనున్న సంగతి తెలిసిందే. దక్షిణాఫ్రికాలో ఒమిక్రాన్‌ తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఇరు దేశాల క్రికెట్ బోర్డులు కోవిడ్ రూల్స్‌పై కీలక నిర్ణయం తీసుకున్నట్టు.. CSA చీఫ్ మెడికల్ ఆఫీసర్ షుయబ్ మంజ్రా ఓ జాతీయ న్యూస్ చానెల్‌కు వెల్లడించినట్టు ప్రచురించింది.

‘ప్రస్తుతం ఆటగాళ్లు అందరూ బయోబబుల్‌లో ఉంటున్నారు.. కొవిడ్ నెగెటివ్ నిర్ధారణ అనంతరమే ప్రాక్టీస్ మొదలుపెట్టారు. అందుకే ఒక హోటల్ పూర్తిగా భారత ఆటగాళ్లకే కేటాయించడం జరిగింది.. ఒక గదిలో ఒకే ఆటగాడు ఉంటాడని కొవిడ్ రూల్స్‌ను మరోసారి గుర్తు చేశారు. ఒకవేళ మ్యాచ్‌లు కొనసాగుతున్న సమయంలో ఆటగాళ్లు, జట్టు బృందానికి పాజిటివ్ నిర్ధారణ అయితే వారిని ఐసోలేషన్ తరలించి.. యథావిధిగా మిగతా ఆటగాళ్లతో మ్యాచులు కొనసాగించేందుకు ఇరు దేశాల క్రికెట్ బోర్డులు నిర్ణయం తీసుకున్నట్టు షుయబ్ మంజ్రా తెలిపాడని రాసుకొచ్చింది. ఇక ఆయా ఆటగాళ్ల చికిత్సకు కూడా అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్టు పేర్కొంది.

Tags:    

Similar News