నాన్ననే ముద్దుపెట్టమన్నాడు..ఎలా చేయాలో కూడా చెప్పాడు : హీరోయిన్

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ‘బాంబే బేగమ్స్‌’తో సూపర్ హిట్ కొట్టేసిన 40 ప్లస్ బ్యూటీ..తన మొదటి కిస్ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించింది. ‘సడక్’ సినిమాతో 18 ఏళ్ల వయసులో బాలీవుడ్‌కు ఎంటర్ అయిన పూజ..తన కలల రాకుమారుడు సంజయ్ దత్‌తో ఫస్ట్ సినిమా చేసే చాన్స్ వచ్చిందని తెలిపింది. అయితే ఈ చిత్రంలో ముద్దు సీన్ […]

Update: 2021-03-08 01:52 GMT

దిశ, సినిమా : బాలీవుడ్ హీరోయిన్ పూజా భట్ లాంగ్ బ్రేక్ తర్వాత మళ్లీ ఇప్పుడు సినిమాల్లోకి రీఎంట్రీ ఇస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ అయిన ‘బాంబే బేగమ్స్‌’తో సూపర్ హిట్ కొట్టేసిన 40 ప్లస్ బ్యూటీ..తన మొదటి కిస్ ఎక్స్‌పీరియన్స్ గురించి వివరించింది. ‘సడక్’ సినిమాతో 18 ఏళ్ల వయసులో బాలీవుడ్‌కు ఎంటర్ అయిన పూజ..తన కలల రాకుమారుడు సంజయ్ దత్‌తో ఫస్ట్ సినిమా చేసే చాన్స్ వచ్చిందని తెలిపింది. అయితే ఈ చిత్రంలో ముద్దు సీన్ ఉందని, ఎలా చేయాలి? అని చాలా భయపడిపోతుంటే..తన తండ్రి, సినిమా డైరెక్టర్ మహేష్ భట్ ముద్దు సీన్ గురించి వివరించారని ఓ ఇంటర్వ్యూలో తెలిపింది.

ముద్దు పెట్టుకోవడం అనేది తప్పు కాదని, దాన్ని వల్గర్‌గా చూస్తే వల్గర్‌గానే కనిపిస్తుందని, సినిమా కోసం చేస్తున్నాం కాబట్టి గౌరవంగా భావిస్తే గౌరవంగానే ఉంటుందని చెప్పారని వివరించింది. నాన్న చెప్పిన మాటలకు ఇన్‌స్పైర్ అయి సీన్ సూపర్‌గా చేశానని, ఇప్పటికీ ప్రతీ సన్నివేశం చేసేటప్పుడు నాన్న మాటలు గుర్తుచేసుకుంటానని చెప్పింది. కాగా ఓ మ్యాగజైన్ కోసం మహేష్ భట్ తన కూతురు పూజా భట్‌ను ముద్దుపెట్టుకున్న ఫొటోలపై అప్పట్లో చాలా ట్రోల్స్ ఎదుర్కొన్నారు. అంతేకాదు గతంలో పూజా భట్‌ను మహేష్ భట్ పెళ్లి చేసుకుంటాడనే వార్తలు కూడా వచ్చాయి.

Tags:    

Similar News