కాలుష్యం తగ్గిండొచ్చు… అయినా తలొగ్గుండు!

క్వారంటైన్‌లో కాలుష్యం తగ్గిపోయిందని, ఇంటి నుంచే హిమాలయాలు కనిపిస్తున్నాయని తెగ ఫొటోలు దిగుతూ… అందరూ సంబరపడిపోయారు. అయితే కాలుష్యం తగ్గిందన్న మాటా నిజమే. హిమాలయాలు కనిపించిన మాటా నిజమే. గాలి పీల్చుకునేంత స్వచ్ఛంగా మారిందన్న మాట కూడా నిజమే. మరి ఇంతకీ సమస్యేంటి అంటారా? కాలుష్యం మాత్రమే తగ్గింది… కార్బన్‌డయాక్సైడ్ అలాగే ఉంది. అవును.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషియానోగ్రఫీ వారు విడుదల చేసిన కొత్త రీడింగుల ప్రకారం వాతావరణ కార్బన్‌డయాక్సైడ్ స్థాయి […]

Update: 2020-06-05 03:01 GMT

క్వారంటైన్‌లో కాలుష్యం తగ్గిపోయిందని, ఇంటి నుంచే హిమాలయాలు కనిపిస్తున్నాయని తెగ ఫొటోలు దిగుతూ… అందరూ సంబరపడిపోయారు. అయితే కాలుష్యం తగ్గిందన్న మాటా నిజమే. హిమాలయాలు కనిపించిన మాటా నిజమే. గాలి పీల్చుకునేంత స్వచ్ఛంగా మారిందన్న మాట కూడా నిజమే. మరి ఇంతకీ సమస్యేంటి అంటారా? కాలుష్యం మాత్రమే తగ్గింది… కార్బన్‌డయాక్సైడ్ అలాగే ఉంది. అవును.. కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన స్క్రిప్స్ ఇనిస్టిట్యూషన్ ఆఫ్ ఓషియానోగ్రఫీ వారు విడుదల చేసిన కొత్త రీడింగుల ప్రకారం వాతావరణ కార్బన్‌డయాక్సైడ్ స్థాయి ఏ మాత్రం తగ్గలేదని తేలింది.

మే నెలలో కార్బన్‌డయాక్సైడ్ స్థాయి మిలియన్ వాయుకణాలకు 417.2 పార్టులుగా ఉన్నట్లు తెలిసింది. గత ఆరు దశాబ్దాల్లో ఇలా నమోదవడం ఇదే మొదటిసారి. మే 2019 రీడింగుతో పోల్చితే ఇది 2.4 పీపీఎం ఎక్కువ. లాక్‌డౌన్ కారణంగా పరిశ్రమలు మూసివేసి ఉన్నప్పటికీ కార్బన్‌డయాక్సైడ్ స్థాయిలో మార్పు రాకపోవడాన్ని బట్టి కేవలం పరిశ్రమల ఉద్గారాల వల్ల మాత్రమే కాకుండా ఇతర కార్యకలాపాల వల్ల కూడా కార్బన్‌డయాక్సైడ్ అధిక మొత్తంలో విడుదలవుతోందని అర్థం చేసుకోవచ్చు. అలాగే గ్లోబల్ కార్బన్ ప్రాజెక్టు నివేదిక ప్రకారం కొవిడ్ 19 లాక్‌డౌన్ కారణంగా గత నెల కర్బన ఉద్గారం 4 శాతం తగ్గిందని, ఈ ఏడాది చివరికల్లా అది 7 శాతానికి తగ్గుతుందని ఉంది. అయితే కర్బన విడుదల తగ్గినప్పటికీ ఇప్పటికే వాతావరణంలో ఉన్న కార్బన్‌‌డయాక్సైడ్ స్థాయిలో ఎలాంటి ప్రభావం కనిపించడం లేదు. తద్వారా భవిష్యత్తులో జరగబోతోందనుకుంటున్న వాతావరణ మార్పుల సంక్షోభం మీద కూడా సకారాత్మక ప్రభావం కనిపించడం లేదని ప్రొఫెసర్ కొరిన్నే లె క్వెరే అంటున్నారు.

Tags:    

Similar News