బాణసంచా కాల్చడంపై పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ సంచలన నిర్ణయం
దిశ, డైనమిక్ బ్యూరో : బాణ సంచా ద్వారా కరోనా విజృంభించే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా పేల్చడంతో సహా కాల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ) నిర్ణయం తీసుకుంది. బాణసంచా కాల్చుతూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం వల్ల భౌతికదూరం నిబంధన ఉల్లంఘించడంతో పాటు తీవ్ర వాయుకాలుష్యం కూడా ఏర్పడుతుందని కమిటీ అభిప్రాయపడింది. కరోనా సంక్షోభ సమయంలో బాణసంచా కాలిస్తే శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, […]
దిశ, డైనమిక్ బ్యూరో : బాణ సంచా ద్వారా కరోనా విజృంభించే అవకాశం అధికంగా ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రవ్యాప్తంగా బాణసంచా పేల్చడంతో సహా కాల్చడాన్ని నిషేధిస్తూ ఢిల్లీ కాలుష్య నియంత్రణ కమిటీ(డీపీసీసీ) నిర్ణయం తీసుకుంది. బాణసంచా కాల్చుతూ పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహించడం వల్ల భౌతికదూరం నిబంధన ఉల్లంఘించడంతో పాటు తీవ్ర వాయుకాలుష్యం కూడా ఏర్పడుతుందని కమిటీ అభిప్రాయపడింది.
కరోనా సంక్షోభ సమయంలో బాణసంచా కాలిస్తే శ్వాసకోశ వ్యాధులు పెరిగే అవకాశం ఉందని, అది ప్రజారోగ్యానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదని పేర్కొంది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ప్రాంతంలో 2022 జనవరి 1 వరకు అన్నిరకాల టపాసులు కాల్చడం సహా, అమ్మకాలపై పూర్తి నిషేధం కొనసాగుతుందని కమిటీ స్పష్టం చేసింది. ఈక్రమంలో జిల్లా కలెక్టర్లు తమ జిల్లా పరిధిలో ఈ తాజా సూచనలు అమలయ్యేలా చూడాలని, తీసుకున్న చర్యలపై తమకు నివేదిక సమర్పించాలని కమిటీ వెల్లడించింది.