AP Politics: కడపలో వైఎస్సార్ పేరు మాయం.. జగన్ రియాక్షన్ ఏంటి..?
2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే.
దిశ వెబ్ డెస్క్: 2019 ఎన్నికల్లో వైసీపీ 151 సీట్లను కైవసం చేసుకుని అధికారంలోకి వచ్చిన విషయం అందరికీ తెలిసిందే. కాగా వైసీపీ గెలవడంతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యారు. అయితే జగన్ ముఖ్యమంత్రి అయిన తరువాత టీడీపీ గుర్తులు చెరిపేయడమే పనిగా పెట్టుకున్నారు అనే విమర్శలు సైతం అందుకున్నారు. ఆ విమర్శలకు పలు కారణాలు ఉన్నాయి.
విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు..
దేశంలోనే మొదటి ఆరోగ్య వైద్య విశ్వవిద్యాలయం ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్. దీన్ని నందమూరి తారక రామారావు 1986లో ప్రస్తుత ఎన్టీఆర్ జిల్లా, విజయవాడ నగరంలో స్థాపించారు. కాగా అప్పటి ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్‌లో అనేక కమిటీలు ఇచ్చిన సిఫార్సులను పరిగణలోకి తీసుకుని రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ శాసనసభ చట్టం 6 ద్వారా ఆరోగ్య శాస్త్రాల మొదటి విశ్వవిద్యాలయంగా ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ స్థాపించబడింది.
అయితే ప్రముఖ సినీ నటుడు, టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు(ఎన్టీఆర్) మరణానంతరం ఆంధ్ర ప్రదేశ్ విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును మార్చి,1998లో విశ్వవిద్యాలయానికి దాని వ్యవస్థాపకుడు ఎన్.టి.రామారావు పేరు పెట్టారు. అప్పటి నుండి ఎన్.టి.ఆర్.విశ్వవిద్యాలయం ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా ప్రాచూర్యంపొందింది.
అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత 2022లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, ఎన్.టి.ఆర్. యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పేరును వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్‌గా పేరును మార్చారు. అప్పటి సీఎంగా జగన్ తీసుకున్న ఈ నిర్ణయం పలు విమర్శలకు దారితీసింది.
కడపకు వైఎస్సాఆర్ పేరు..
ఆంధ్రప్రదేశ్‌లోని రాయలసీమ జిల్లాల్లో ఒక్కటైన కడప జిల్లా పేరును వైఎస్సాఆర్ కడప జిల్లాగా మార్చారు. అలానే విశాఖపట్నంలో అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ ప్రముఖ పర్యాటక స్థలంగా పేరుగాంచింది. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరును వైఎస్ఆర్ వ్యూ పాయింట్ అని అప్పటి ముఖ్యమంత్రి జగన్ మార్చారు.
అన్నా క్యాంటీన్‌లు మూత..
టీడీపీ హయాంలో నారా చంద్రబాబు నాయుడు పేదల ఆకలి దృష్టిలో ఉంచుకుని కేవలం 5 రూపాయలకే ప్రజలకు భోజనం అందించాలనే సదుద్దేశంతో అన్నా క్యాంటీన్‌లు ఏర్పాటు చేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక జగన్ ఆ అన్నా క్యాంటీన్‌లను మూసేశారు.
మాయమైన వైఎస్సాఆర్ పేరు..
నిన్న విలువడిన ఫలితాల్లో కూటమి బారీ విజయం సాధించిందని తెలిసిన వెంటనే టీడీపీ కార్యకర్తలు వైఎస్‌ఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ బోర్డును తొలిగించి, దాని స్థానంలో ఎన్టీఆర్ పేరుతో ఉన్న బోర్డు పెట్టారు. అలానే విశాఖలోనూ వైఎస్ఆర్ వ్యూ పాయింట్ పేరును అబ్దుల్ కలాం వ్యూ పాయింట్ పేరుగా గుర్తు తెలియని వ్యక్తులు మార్చారు.
వైఎస్సాఆర్ కడప పేరు మారనుందా..?
వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జగన్ కడపకు వైఎస్సాఆర్ పేరు పెట్టడమేకాకుండా, టీడీపీ గుర్తులను చెరిపే ప్రయత్నం చేశారు. అయితే ప్రస్తుతం కూటమి అధికారంలోకి వచ్చింది. టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అటు ప్రజలతోపాటు ఇటు రాజకీయనేతలు సైతం జగన్ అధికారంలో ఉన్నప్పుడు చేసిన అనాలోచితపనుల గురించి చర్చించుకుంటున్నారు.
జగన్ అధికారంలో ఉన్నప్పుడు టీడీపీ గుర్తులు చెరిపేసేందుకు యత్నించారు. మరి ఇప్పుడు చంద్రబాబు అధికారంలోకి వచ్చారు. ఆయన వైఎస్సాఆర్ కడప పేరును మారిస్తే జగన్ ఏం చేస్తారని ప్రజలు చర్చించుకుంటున్నారు. అయితే చంద్రబాబు అలా చేయరని, ఇతరులు అభిప్రాయాలను గౌరవిస్తారని, పైగా వైఎస్సాఆర్ చంద్రబాబుకు మంచి స్నేహితుడుగనుక కడప పేరు మార్చే యోచన చేయరని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.