ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి బహిరంగంగా మాట్లాడకూడదు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు

జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah Chowdary) అన్నారు.

Update: 2025-03-25 08:27 GMT
ఎన్డీఏలో ఉన్నాం కాబట్టి బహిరంగంగా మాట్లాడకూడదు.. గోరంట్ల బుచ్చయ్య చౌదరి కీలక వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో : జనాభా విషయంలో దక్షిణాది రాష్ట్రాలు చాలా క్రమశిక్షణ పాటించాయని ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి(MLA Gorantla Butchaiah Chowdary) అన్నారు. ఇప్పుడు జనాభా పేరుతో సీట్లు తగ్గించటం సరికాదన్నారు. రాజమండ్రి(Rajahmundry)లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నియోజకవర్గాల పునర్విభజన(Redistribution of constituencies)పై కీలక వ్యాఖ్యలు చేశారు. కేంద్రంతో సీఎం, డిప్యూటీ సీఎం అంతర్గతంగా మాట్లాడుతున్నారని అన్నారు. ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాము కాబట్టి బహిరంగంగా మాట్లాడకూడదు అన్నారు. మూడేళ్ల తర్వాత జగన్ అధికారంలోకి వస్తానంటున్నారు.. ఆయన వచ్చేది రాజమండ్రి సెంట్రల్ జైలు(Rajahmundry Central Jail)కే అని అన్నారు. లిక్కర్ స్కామ్ , మైనింగ్ స్కాంలు బయటికి వస్తున్నాయని జగన్ మళ్ళీ జైలు ఊచలు లెక్కించాల్సిందే అన్నారు.

Tags:    

Similar News