ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. అమరావతిలో హై టెన్షన్..!

అమరావతిలో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే శ్రీధర్ మధ్య పోరు కొనసాగుతోంది.

Update: 2023-04-09 05:00 GMT
ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే.. అమరావతిలో హై టెన్షన్..!
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అమరావతిలో హై టెన్షన్ కొనసాగుతోంది. ఇసుక రీచ్ విషయంలో తలెత్తిన వివాదంతో ఎమ్మెల్యే నంబూరి శంకర్రావు, మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత కొమ్మలపాటి శ్రీధర్ బహిరంగ చర్చకు ఒకరినొకరు సవాలు విసురుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆదివారం ఇరు వర్గాల కార్యకర్తలు పెద్ద ఎత్తున రోడ్ల మీదకు వచ్చారు. ఈ నేపథ్యంలోనే అమరలింగేశ్వర ఆలయంలోపలకి వెళ్లేందుకు ప్రయత్నించిన టీడీపీ కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకోవడానికి ప్రయత్నించగా.. పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది.

టీడీపీ కార్యకర్తలు పోలీస్ వ్యాన్ అద్దాలు ధ్వంసం చేశారు. ఈ క్రమంలోనే కొమ్మలపాటితో సహా టీడీపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ సమయంలో జరిగిన తోపులాట వల్ల కొమ్మలపాటి చొక్కా చినిగింది. ఇక ఎమ్మెల్యే నంబూరికి మద్దతుగా వచ్చిన వైసీపీ కార్యకర్తలు మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటి దిష్టిబొమ్మను దహనం చేశారు. దమ్ముంటే ఆధారాలతో రావాలని ఎమ్మెల్యే నంబూరీ మాజీ ఎమ్మెల్యే కొమ్మలపాటికి సవాలు విసిరారు. 

Tags:    

Similar News