BJP MLA : అక్బరుద్దీన్ ఒవైసీని చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగి శుక్రవారంతో ముగిశాయి. ఈ బడ్జెట్ సెషన్స్‌లో పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది.

Update: 2024-08-03 14:02 GMT
BJP MLA : అక్బరుద్దీన్ ఒవైసీని చూసి భయపడుతున్న రేవంత్ రెడ్డి.. బీజేపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: అసెంబ్లీ సమావేశాలు వాడీవేడిగా కొనసాగి శుక్రవారంతో ముగిశాయి. ఈ బడ్జెట్ సెషన్స్‌లో పార్టీల మధ్య తీవ్ర మాటల యుద్ధం జరిగింది. ఈ నేపథ్యంలోనే కామారెడ్డి బీజేపీ ఎమ్మెల్యే కాటిపల్లి వెంకట రమణా రెడ్డి సీఎం రేవంత్‌పై ఫైర్ అయ్యారు. రేవంత్ ప్రభుత్వం ఏమీ చేస్తుందో చెప్పకుండా గత ప్రభుత్వాన్ని విమర్శించడం పనిగా పెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. విధ్వంసం, అప్పుల పాలైన తెలంగాణలో రూ.31వేల కోట్లతో రుణమాఫీ ఎలా జరిగిందని, లక్ష 50 వేల కోట్ల రూపాయలతో మూసీ ప్రక్షాళన ఎలా చేస్తారని ప్రశ్నించారు. అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడితే సినిమా చూసినట్లు చూస్తారని, బీజేపీకి మాత్రం టైం ఇవ్వమంటే ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. సీఎం రేవంత్ రెడ్డి అక్బరుద్దీన్ ఒవైసీని చూస్తే గజగజలాడుతున్నాడని, నయా నిజాం లెక్క మాట్లాడుతున్నడని ఆగ్రహం వ్యక్తం చేశారు.


Similar News