ప్రపంచవ్యాప్తంగా మారుమోగిన పిఠాపురం.. గూగుల్ ట్రెండ్స్ డేటాలో మోదటిస్థానం..
ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఏపీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి.
దిశ వెబ్ డెస్క్:ఆంధ్రప్రదేశ్ ప్రజలతో పాటు యావత్ భారతదేశం ఉత్కంఠగా ఎదురుచూసిన ఏపీ ఎన్నికల ఫలితాలు నిన్న విడుదలయ్యాయి.ఈ ఫలితాల్లో కూటమి ఘన విజయం సాధించి చరిత్ర సృష్టించింది. కాగా కూటమిలో భాగమైన జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుండి పోటీ చేసిన విషయం అందరికీ తెలిసిందే.
అయితే ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పోటీ చేసిన పిఠాపురంకి సంబంధించిన ఒక వార్త సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అదే ప్రపంచవ్యాప్తంగా పిఠాపురం గురించి సర్చ్ చేశారు. గూగుల్ ట్రెండ్స్ డేటా ప్రకారం గత 30 రోజులుగా పిఠాపురం అనే ట్యాగ్ యూఏఈ, యూఎస్ఏ, కెనడా, యూకే, ఆస్ట్రేలియా దేశాలన్నింటిలో ఎక్కువగా సెర్చ్ చేశారు అని గూగుల్ ట్రెండ్స్ డేటాలో తేలింది.
అలానే పిఠాపురం అనే టాగ్ ప్రస్తుతం చాలా ట్రెండింగ్‌లో ఉంది అని google స్పష్టం చేసింది. దీనికి కారణం కేవలం పవన్ కళ్యాణ్ అని, ఆయన కోసమే ప్రజలు పిఠాపురం గురించి అంతలా గూగుల్‌లో సెర్చ్ చేస్తున్నారని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఇక 2019 ఎన్నికల్లో ఓటమిని చవిచూసిన పవన్ కళ్యాణ్ 2024 ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం అహర్నిశలు శ్రమించారు.
ఆయన శ్రమకు తగిన ఫలితంగా కూటమి భారీ విజయంతో అధికారంలోకి వచ్చిందని అటు విశ్లేషకులతోపాటు, సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు, ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.