Accident: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఎంపీకి రోడ్డుప్రమాదం

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) నేటితో (ఫిబ్రవరి 26) ముగియనుంది.

Update: 2025-02-26 07:30 GMT
Accident: కుంభమేళా నుంచి తిరిగి వస్తుండగా ఎంపీకి రోడ్డుప్రమాదం
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహా కుంభమేళా (Maha Kumbh Mela) నేటితో (ఫిబ్రవరి 26) ముగియనుంది. చివరి అమృత్ స్నానం ఆచరించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ప్రయాగ్‌రాజ్‌కు పొటెత్తారు. ఈ నేపథ్యంలో త్రివేణి సంగమంలో పుణ్యాస్నానం ఆచరించి తిరిగి వస్తుండగా ఓ రాజ్యసభ ఎంపీకి ప్రమాదం జరిగింది. ఆ ఘటనలో ఆమె స్వల్ప గాయాలతో బయటపడ్డారు. పూర్తి వివరాల్లోకి వెళ్లితే..

ఝార్ఖండ్ రాష్ట్రం ముక్తి మోర్చా (JMM) పార్టీకి చెందిన రాజ్యసభ ఎంపీ మహువా మాజి (Mahua Maji) తన కుటుంబ సభ్యులతో కలిసి కుంభమేళాకు వెళ్లారు. అక్కడ పుణ్యాస్నానాలు ముగించుకుని బుధవారం తెల్లవారుజామున తిరిగి పయనం అయ్యారు. వారు ప్రయాణిస్తున్న కారు ఝార్ఖండ్‌లోని లతేహార్‌ ప్రాంతంలో ఆగి ఉన్న ఓ ట్రక్కును కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎంపీకి, ఆమె కుటుంబ సభ్యులకు స్వల్పంగా గాయాలయ్యాయి.

వెంటనే స్థానికులు స్పందించి వారిని వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించి, ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాంచీ (Ranchi)లోని రిమ్స్‌కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఎంపీ చేతికి పలు ఫ్రాక్చర్‌లు అయ్యాయని, ప్రస్తుతం వారి పరిస్థితి నిలకడగా ఉందని తెలిపారు. 

Tags:    

Similar News