Thummala Nageshwara Rao : ఆయిల్ కంపెనీలపై మంత్రి తుమ్మల సీరియస్
ఆయిల్ కంపెనీల తీరుపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageshwara Rao) సీరియస్ అయ్యారు.
దిశ, వెబ్ డెస్క్ : ఆయిల్ కంపెనీల తీరుపై వ్యవసాయశాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు(Minister Thummala Nageshwara Rao) సీరియస్ అయ్యారు. శనివారం పామాయిల్ కంపెనీల పనితీరుపై సమీక్ష నిర్వహించిన మంత్రి.. పురోగతి లేని కంపెనీలపై సీరియస్ అయ్యారు. తీరు మార్చుకోకుంటే కంపెనీల అనుమతులు రద్దు చేస్తామని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2025 చివరి నాటికి వారికి కేటాయించిన జోన్లలో కచ్చితంగా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయాల్సిందేనని చెప్పారు. రాష్ట్రంలో ఆయిల్ పామ్ సాగును లాభసాటిగా మార్చదమే ప్రభుత్వ ధ్యేయమని పేర్కొన్నారు. ఆయిల్ పామ్ సాగులో రాష్ట్రాన్ని దేశంలో నంబర్ వన్ గా నిలపాలని, ఇందుకు కావాల్సిన అన్ని రకాల చర్యలను చేపట్టాలని ఈ సందర్భంగా మంత్రి తుమ్మల అధికారులకు సూచించారు.