‘మార్చి 10న కవిత అరెస్ట్.. కేసీఆర్ పతనం ప్రారంభం’

లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

Update: 2023-03-08 08:44 GMT

దిశ, వెబ్‌డెస్క్: లిక్కర్ కుంభకోణం వ్యవహారంలో ఈడీ నోటీసులు అందుకున్న ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం కేసీఆర్ కూతురు, ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కావడం ఖాయమని అన్నారు. మార్చి 10న కవిత అరెస్టు కేసీఆర్ పతనానికి ఆరంభం మాత్రమేనని అన్నారు. తెలంగాణ రైతులు, నిరుద్యోగులు, అమరవీరుల కుటుంబాల కన్నీరు ఉసురు కేసీఆర్ కుటుంబానికి తాకిందని అన్నారు. దేవుడినే శతృవును చేసుకున్న కేసీఆర్ ఫలితం అనుభవిస్తాడని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఎనిమిదేళ్లుగా రాష్ట్రాన్ని నిర్లక్ష్యం చేశాడని అన్నారు. బీఆర్ఎస్ పాలనలో ఎవరూ సంతోషంగా లేరని అన్నారు. కేవలం ఓట్ల కోసమే పథకాలు తీసుకొచ్చి తర్వాత విస్మరించారని అన్నారు.

Tags:    

Similar News