రోడ్డు విస్తరణ పేరుతో దర్గా, గుళ్లను కూల్చొద్దు: మాజీ మంత్రి చిన్నారెడ్డి

వనపర్తి రోడ్డు విస్తరణలో పనులలో భాగంగా రాత్రి సమయంలో దేవాలయాలను, దర్గాలను కూలుస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి మాజీ మంత్రి చిన్నారెడ్డి రోడ్డుపై బైఠాయించారు.

Update: 2023-05-28 14:20 GMT

దిశ, వనపర్తి: వనపర్తి పరిధిలో రోడ్డు విస్తరణ పేరుతో రాత్రి సమయంలో ఎవరూ లేనప్పడు దేవాలయాలను, దర్గాలను కూలుస్తున్నారని నిరసిస్తూ కాంగ్రెస్ నాయకులు, ముస్లిం మైనారిటీ నాయకులతో కలిసి మాజీ మంత్రి చిన్నారెడ్డి రోడ్డుపై బైఠాయించారు. ఈ సందర్బంగా చిన్నారెడ్డి మాట్లాడుతూ.. రోడ్డు విస్తరణకు తాము వ్యతిరేకం కాదని, ప్రజల మనోభావాలను దెబ్బతీసేలా రోడ్డు విస్తరణ పనులు చేపట్టడం ఎంతవరకు సమంజసమని అన్నారు. వనపర్తి పట్టణం లో రోడ్డు విస్తరణ పనులను మొదట 100 ఫీట్ల వెడల్పుతో తీర్మానం చేసి అనంతరం తమకు తోచినట్లుగా ఒక్కచోట 33 ఫీట్లు, ఒకచోట 45 ఫీట్లు రోడ్డు విస్తరణ పనులు చేపడుతున్నారని విమర్శించారు.

ఇది ఇలా ఉండగా మాజీ మంత్రి చిన్నారెడ్డి నిరసన చేపడుతున్న ప్రాంతానికి మున్సిపల్ చైర్మెన్, వైస్ చైర్మన్ గట్టు యాదవ్, వాకిటి శ్రీధర్ లు చేరుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత నాలుగు పర్యాయాలు ఎమ్మెల్యేగా చేసిన మాజీ మంత్రి చిన్నారెడ్డి వనపర్తి పట్టణంలో రోడ్డు విస్తరణ చేయలేకపోయారన్నారు. ఆలయ కమిటీ సభ్యులతో, ముస్లిం మత పెద్దలతో చర్చించి వేరొక స్థలంలో నిర్మాణాలకు స్థలానికి కేటాయిస్తూ నిధులను కూడా కేటాయించామని గుర్తు చేశారు.

ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఇప్పుడు ధర్నాలు చేయడం సబబు కాదని హితవు పలికారు. మత రాజకీయాలతో పట్టణ అభివృద్ధిని అడ్డుకోలేరని అన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వివాదం తార స్థాయికి చేరడంతో పోలీసులు ఇరు వర్గాలను శాంతింపజేసారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు చీర్ల చందర్, ఓబీసీ జిల్లా అధ్యక్షుడు కోట్ల రవి, ముస్లిం మైనారిటీ నాయకులు కమ్మర్ మియా, బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులడు పల్సర్ రమేష్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు ఉంగలం తిరుమల, ముస్లిం మైనారిటీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:    

Similar News