Free Electricity: కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేసిన కాంగ్రెస్ నాయకులు
ఉచిత విద్యుత్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ కి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి అన్నారు.
దిశ, బడంగ్పేట్: ఉచిత విద్యుత్ పేరుతో ప్రజలను మోసం చేస్తున్న సీఎం కేసీఆర్ కి గుణపాఠం చెప్పే రోజులు దగ్గర పడ్డాయని టీపీసీసీ ప్రధాన కార్యదర్శి, మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి అన్నారు. ఏఐసీసీ పిలుపు మేరకు మేయర్ చిగిరింత పారిజాత నర్సింహ రెడ్డి ఆధ్వర్యంలో మహేశ్వరం నియోజకవర్గ పరిధిలోని బాలాపూర్ సబ్ స్టేషన్ వద్ద బుధవారం సీఎం కేసీఆర్ దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. కేసీఆర్ నిరంకుశ పాలనపై ప్రతి ఒక్క కాంగ్రెస్ కార్యకర్త పోరాటం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలను ప్రభుత్వం వక్రీకరిస్తుందని, కాంగ్రెస్ పార్టీ ఎదుగుదలను ఓర్వలేకనే కాంగ్రెస్ పార్టీపై అక్కసు చూపిస్తున్నారని అన్నారు. రాహుల్ గారి అర్హతవేటుపై కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తుంటే కేంద్రంలో ఉన్న బీజేపీ, రాష్ట్రంలో ఉన్న బీఆర్ఎస్ పార్టీలు కుమ్మక్కై మూకుమ్మడిగా దాడి చేస్తున్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు బండారి మనోహర్, నేనావత్ బాలు నాయక్, పెద్దబావి సుదర్శన్ రెడ్డి, మహేశ్వరం యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు బోయపల్లి రాఘవేందర్ రెడ్డి, ఐఎన్టియుసి జిల్లా అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, బడంగ్ పేట్ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు సుబాన్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.