Ravindra Jadeja కు సవాల్.. కాంగ్రెస్ తరపున సొంత అక్క ప్రచారం
రవీంద్ర జడేజా టీంఇండియా ఆటగాడిగా ఆల్ రౌండర్‌గా క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి.

దిశ, వెబ్ డెస్క్: రవీంద్ర జడేజా టీంఇండియా ఆటగాడిగా ఆల్ రౌండర్‌గా క్రికెట్ ప్రపంచానికి పరిచయం అవసరం లేని వ్యక్తి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో తన భార్య రివాబా జడేజా గుజరాత్‌లోని జామ్ నగర్ నుంచి పోటీ చేస్తున్నారు. భార్య తరపున జడేజా విస్తృతంగా ప్రచారం చేస్తు్న్నాడు. బీజేపీ నుంచి రవీంద్ర జడేజా ప్రచారం చేస్తుండగా ఆయన సొంత అక్క నయనాబా కాంగ్రెస్ అభ్యర్థి బిపేంద్ర సిన్హ్ తరపున ప్రచారం చేయడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ అధిష్టానం సైతం నయనాబాకు ప్రచార బాధ్యతలను అప్పగించింది. సొంత అక్కా తమ్ముళ్లు ఇలా రెండు పార్టీల తరపున ప్రచారం చేయడం అందరి దృష్టిని ఆకట్టుకుంది. ఆప్ తరపున కర్సన్ కర్మౌర్ బరిలో ఉన్నారు.