అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా

వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది.

Update: 2023-04-18 10:55 GMT
అవినాశ్ రెడ్డి సీబీఐ విచారణ రేపటికి వాయిదా
  • whatsapp icon

దిశ, వెబ్ డెస్క్: మాజీ ఎంపీ వైఎస్ వివేకా హత్యకేసుకు సంబంధించిన విచారణను సీబీఐ అధికారులు వేగవంతం చేశారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే పలువురిని విచారించిన సీబీఐ.. వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని కూడా విచారించడానికి సిద్ధమైంది. అయితే అవినాశ్ రెడ్డి తరఫు లాయర్లు ఈ విషయమై హైకోర్టును సంప్రదించారు. అవినాశ్ రెడ్డికి ఈ కేసుతో ఎలాంటి సంబంధంలేదని తెలిపారు. ఇక అవినాశ్ రెడ్డిని విచారించడానికి అనుమతి ఇవ్వాలని సీబీఐ అధికారులు కూడా హైకోర్టును కోరారు. ఈ నేపథ్యంలోనే ఇవాళ హైకోర్టులో వాదనలు జరిగాయి.

వివేకా హత్యకు కారణం ఏమై ఉండొచ్చన్న కోర్టు ప్రశ్నకు.. రాజకీయ వివాదాలు కూడా కారణమై ఉండొచ్చని అవినాశ్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమాధానం ఇచ్చారు. వివేకా హత్య కేసులో ఎక్కడా అవినాశ్ పాత్రలేదని కోర్టుకు వివరించారు. సీబీఐ విచారణకు అవినాశ్ అన్ని విధాల సహకరిస్తారని అవినాశ్ తరఫు న్యాయవాది తెలిపారు. ఈ క్రమంలోనే అవినాశ్ రెడ్డికి సంబంధించిన సీబీఐ విచారణ రేపటికి వాయిదా పడింది. కాగా రేపు ఉదయం 10.30 గంటలకు విచారణకు హాజరు కావాలని సీబీఐ అవినాశ్ కు ఉత్తర్వులు పంపింది. కాగా ఈ కేసులో అవినాశ్ రెడ్డి తండ్రి వైఎస్ భాస్కర్ రెడ్డిని సీబీఐ అధికారులు అదుపులోకి తీసుకొని విచారించారు. 

Tags:    

Similar News