జర్నలిస్టు ప్రవీణ్ గౌడ్‌కు కన్నీటీ వీడ్కోలు
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ వార్త ప్రత్రిక విలేకరి, సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్‌గౌడ్ అంత్యక్రియలు ఆదివారం పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఇంటివద్ద ఉంచిన పార్థీవ దేహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు ప్రవీణ్ కుటుంబీకులు, బంధుమిత్రులు, నర్సాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నర్సాపూర్ సమీపంలోని వైకుంఠధామంలో ప్రవీణ్‌గౌడ్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన ఇంటివద్ద ప్రవీణ్ భార్య లక్ష్మి ప్రసన్న, ముగ్గురు కుమారులు రోదించిన తీరు పలువురిని కంటతడి […]
దిశ, నర్సాపూర్ : నర్సాపూర్ వార్త ప్రత్రిక విలేకరి, సీనియర్ జర్నలిస్టు ప్రవీణ్‌గౌడ్ అంత్యక్రియలు ఆదివారం పట్టణంలో జరిగాయి. ఈ సందర్భంగా ఆయన ఇంటివద్ద ఉంచిన పార్థీవ దేహానికి పూలమాలలు వేసి పలువురు నివాళులు అర్పించారు. అంత్యక్రియలకు ప్రవీణ్ కుటుంబీకులు, బంధుమిత్రులు, నర్సాపూర్ నియోజకవర్గ జర్నలిస్టులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. నర్సాపూర్ సమీపంలోని వైకుంఠధామంలో ప్రవీణ్‌గౌడ్ అంత్యక్రియలు నిర్వహించారు. అంతకుముందు ఆయన ఇంటివద్ద ప్రవీణ్ భార్య లక్ష్మి ప్రసన్న, ముగ్గురు కుమారులు రోదించిన తీరు పలువురిని కంటతడి పెట్టించాయి.
జర్నలిస్టు ప్రవీణ్ గౌడ్‌కు ఘననివాళి..
జర్నలిస్టు ప్రవీణ్ గౌడ్‌ను చివరిసారి చూడటానికి నియోజకవర్గానికి చెందిన ఆయా రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాల నాయకులు, జర్నలిస్టులతో పాటు రాష్ర్ట మహిళా కమిషన్ చైర్‌పర్సన్ సునీతా లక్ష్మారెడ్డి, గ్రంధాలయ సంస్థ చైర్మన్ చంద్రాగౌడ్, మున్సిపల్ చైర్మన్ మురళీయాదవ్, మార్కెట్ కమిటీ చైర్మన్ అనసూయ అశోక్ గౌడ్, టీపీసీ రాష్ర్ట అధికార ప్రతినిధి ఆంజనేయులు గౌడ్, రాష్ర్ట నాయకులు రవీందర్ రెడ్డి, బీజేపీ నియోజకవర్గ ఇంచార్జి గోపీ, మాజీ ఎంపీపీ రమణారావు, కొంతాన్ పల్లి సర్పంచ్ శ్రీనివాస్‌గౌడ్, కౌన్సిలర్‌లు, సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ప్రవీణ్ మృతదేహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు.
జర్నలిస్టు ప్రవీణ్ గౌడ్ అమర్ హై..
జర్నలిస్టు ప్రవీణ్ గౌడ్ అమర్ హై అంటూ డివిజన్ కేంద్రమైన నర్సాపూర్‌తో పాటు శివ్వంపేట, కౌడిపల్లి తదితర మండలాలలో ప్రవీణ్‌గౌడ్‌కు ఘన నివాళ‌్లు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ప్రవీణ్‌గౌడ్ అమర్ హై అంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్లుజే రాష్ర్ట కార్యదర్శి విరాహాత్ అలీ, జిల్లా అధ్యక్షుడు శంకర్ దయాల్ చారి, నాయకులు కంది శ్రీనివాస్‌రెడ్డి, బిక్షపతి, శ్రీనివాస్, నర్సింహరెడ్డి, గణేష్, సుధాకర్, శ్రీనివాస్, మహేష్ తదితరులు పాల్గొన్నారు.