అద్దె చెల్లించలేదని పోలీసుల చిత్రహింసలు
దిశ, వెబ్‌డెస్క్: చైన్నైలోని పుళల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ వ్యక్తిని, అద్దె చెల్లించాలని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. దీంతో పోలీసుల దెబ్బలకు తాళలేక బాధితుడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు. లాక్‌డౌన్ వల్ల మూడు నెలలుగా అద్దె చెల్లించలేదని శ్రీనివాసన్‌ను యజమాని రాజేంద్రన్ పోలీసులతో కొట్టించాడు. దీంతో బాధితుడు చేసేదేం లేక తన ఆవేదనను సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, అనంతరం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. […]
దిశ, వెబ్‌డెస్క్: చైన్నైలోని పుళల్‌లో దారుణ ఘటన చోటుచేసుకుంది. లాక్ డౌన్ కారణంగా ఉపాధి కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఓ వ్యక్తిని, అద్దె చెల్లించాలని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. దీంతో పోలీసుల దెబ్బలకు తాళలేక బాధితుడు శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకున్నాడు.
లాక్‌డౌన్ వల్ల మూడు నెలలుగా అద్దె చెల్లించలేదని శ్రీనివాసన్‌ను యజమాని రాజేంద్రన్ పోలీసులతో కొట్టించాడు. దీంతో బాధితుడు చేసేదేం లేక తన ఆవేదనను సెల్ ఫోన్‌లో చిత్రీకరించి, అనంతరం శ్రీనివాస్ ఆత్మహత్య చేసుకుని మరణించాడు. ప్రస్తుతం శ్రీనివాస్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. విషయం తెలిసిన అధికారులు ఇన్ స్పెక్టర్ పెనసాంను సస్పెండ్ చేశారు.