పోలీసుల కూంబింగ్.. బయటపడ్డ మావోల స్థావరాలు
దిశ ప్రతినిధి, వరంగల్ : గత మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర మధ్య రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను పట్టుకునేందుకు అడవుల్లో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ సంగం పేరుతో నారాయణపూర్, కంకర్ , గడ్చిరోలి ట్రై జంక్షన్ ప్రాంతంలో బృందాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈక్రమంలోనే మావోయిస్టులు తలదాచుకుంటున్న ఏడు స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు. స్థావరాల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను, మందుగుండు […]
దిశ ప్రతినిధి, వరంగల్ : గత మూడు రోజులుగా ఛత్తీస్‌గఢ్-మహారాష్ట్ర మధ్య రాష్ట్ర సరిహద్దు ప్రాంతాన్ని డీఆర్‌జీ, ఎస్‌టీఎఫ్, ఐటీబీపీ, బీఎస్ఎఫ్ బలగాలు జల్లెడ పడుతున్నాయి. మావోయిస్టులను పట్టుకునేందుకు అడవుల్లో క్షుణ్ణంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆపరేషన్ సంగం పేరుతో నారాయణపూర్, కంకర్ , గడ్చిరోలి ట్రై జంక్షన్ ప్రాంతంలో బృందాలు కూంబింగ్ ప్రారంభించాయి. ఈక్రమంలోనే మావోయిస్టులు తలదాచుకుంటున్న ఏడు స్థావరాలపై పోలీసులు దాడులు చేశారు.
స్థావరాల నుంచి పెద్ద మొత్తంలో ఆయుధాలను, పేలుడు పదార్థాలను, మందుగుండు సామగ్రి, క్యాంపింగ్ సామాగ్రి, మందులను స్వాధీనం చేసుకున్నారు. నార్త్ బస్తార్‌కు చెందిన ఉన్నతస్థాయిలోని మావోయిస్టులు ఇక్కడ మకాం వేసినట్టు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉండగా కూంబింగ్ నిర్వహిస్తున్న భద్రతా సిబ్బందికి మావోయిస్టులకు మధ్య జరిగిన ఎదురుకాల్పుల్లో ఒక జవాను మృతిచెందగా మరొకరు తీవ్రంగా గాయపడినట్లుగా పోలీస్ అధికారులు వెల్లడించారు.