పోలీస్ రాసలీలలు.. ఫిర్యాదు చేయడానికి వచ్చిన మహిళను ముద్దు అడుగుతూ

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళలపై  లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఈ వేధింపులను మహిళలు భరిస్తూనే ఉన్నారు. బస్సుల్లో, ఆఫీస్ లో, పబ్లిక్ ప్లేస్ లని కూడా చూడకుండా వారిని వెంటాడి వేధిస్తున్నారు. చివరికి హాస్పిటల్, పోలీస్ స్టేషన్ లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన ఒక మహిళను ఒక పోలీస్ అధికారి లైంగికంగా వేధించిన ఘటన కేరళలో వెలుగుచూసింది. అసభ్యకరమైన పదజాలంతో ఆమెను వేధిస్తూ, […]

Update: 2021-08-27 00:12 GMT

దిశ, వెబ్‌డెస్క్: రోజురోజుకు మహిళలపై లైంగిక వేధింపులు ఎక్కువైపోతున్నాయి. ఎక్కడికి వెళ్లినా ఈ వేధింపులను మహిళలు భరిస్తూనే ఉన్నారు. బస్సుల్లో, ఆఫీస్ లో, పబ్లిక్ ప్లేస్ లని కూడా చూడకుండా వారిని వెంటాడి వేధిస్తున్నారు. చివరికి హాస్పిటల్, పోలీస్ స్టేషన్ లలో కూడా మహిళలకు రక్షణ లేకుండా పోయింది. పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు ఇవ్వడానికి వచ్చిన ఒక మహిళను ఒక పోలీస్ అధికారి లైంగికంగా వేధించిన ఘటన కేరళలో వెలుగుచూసింది. అసభ్యకరమైన పదజాలంతో ఆమెను వేధిస్తూ, తన కోరిక తీర్చాలని వెంటపడుతుండంతో ఆమె ఉన్నతాధికారులకు తెలపడంతో అతగాడి బాగోతం బయటపడింది.

వివరాలలోకి వెళితే.. కాలయపురానికి చెందిన ఓ మహిళ తన ఇంటివద్ద ఆకతాయిలు అల్లరి చేస్తున్నారని, మద్యం తాగిన వ్యక్తులు తన ఇంటి వద్ద నానా రచ్చ చేస్తున్నారని, వారిని పిలిపించి దండించాలని కోరుతూ నాలుగు రోజుల క్రితం కొట్టారక్కర పోలీసులను కోరింది. మహిళ ఫిర్యాదు చేసి ఆమె డిటైల్స్ ఇచ్చివెళ్లింది. ఆ కేసును విచారించిన పోలీసు అధికారి బిజు జాన్ (43) మందుబాబులను పిలిచి వార్నింగ్ ఇచ్చి పంపించేశాడు.

ఇక ఆ తర్వాత నుంచి మహిళ ఫోన్ నెంబర్ తీసుకొని ఆమెను వేధించడం మొదలుపెట్టాడు. ఆమెకు ఫోన్ చేసి ముద్దు అడగడంతో పాటు, అసభ్యకరమైన సంభాషణలు కొనసాగించాడు. దీంతో ఆ వేధింపులు భరించలేని మహిళ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుమేరకు విచారించిన ఉన్నతాధికారులు జిజు జాన్ చర్యలు నిర్దారించిన తర్వాత.. అతని సస్పెండ్ చేశారు.

ఇవి కూడా చదవండి:

శృంగారంలో ‘సేఫ్టీ’ మరిచి.. ‘జిగురు’తో ప్రాణాలు విడిచే..!

పోర్నోగ్రఫీపై భారతీయ చట్టం ఏం చెబుతోంది..?

Tags:    

Similar News