గద్వాల జిల్లాలోని నదీ తీర ప్రాంతాల్లో భద్రత కట్టుదిట్టం
దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ కే అపూర్వరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పికెట్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్‌లో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటున్నా […]
దిశ, మహబూబ్నగర్: జోగులాంబ గద్వాల జిల్లాలో కరోనా మహమ్మారి విజృంభిస్తుండటంతో ముందుజాగ్రత్త చర్యగా కృష్ణా నదీ తీర ప్రాంతాల్లో కఠిన ఆంక్షలు అమలు చేయాలని వనపర్తి జిల్లా ఎస్పీ కే అపూర్వరావు ఆదేశాలు జారీ చేశారు. ఈ మేరకు చిన్నంబావి పోలీస్ స్టేషన్ పరిధిలోని కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో పికెట్లు ఏర్పాటు చేశారు. బుధవారం ఎస్సై శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ లాక్ డౌన్‌లో భాగంగా కఠిన చర్యలు తీసుకుంటున్నా కొంత మంది పోలీసులకు సహకరించడం లేదన్నారు. ఈ కారణంగా వైరస్ కేసులు పెరుగుతున్నాయన్నారు. ప్రజలు అర్థం చేసుకుని సహకరించాలని కోరారు.
Tags: lockdown, River Coastal Area, police alert, mahabubnagar