గుంటూరు నకిలీ కరెన్సీ కలకలం

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్ల బ్యాగును మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు వెంగళాయపాలెం వద్ద వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో మొత్తం ఐదువందల, రెండువేల నోట్లు ఉన్నట్టు నల్లపాడు సీఐ వీరస్వామి తెలిపారు. అంతేగాకుండా రెండు వేల నోట్లపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్ర ఉందని వెల్లడించారు. దీంతో […]

Update: 2020-10-20 02:26 GMT

దిశ, వెబ్‌డెస్క్: గుంటూరు జిల్లాలో నకిలీ కరెన్సీ నోట్లు కలకలం రేపాయి. సుమారు రెండున్నర కోట్ల విలువ చేసే నకిలీ కరెన్సీ నోట్ల బ్యాగును మంగళవారం గుర్తుతెలియని వ్యక్తులు వెంగళాయపాలెం వద్ద వదిలి వెళ్లారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, బ్యాగు స్వాధీనం చేసుకున్నారు. బ్యాగులో మొత్తం ఐదువందల, రెండువేల నోట్లు ఉన్నట్టు నల్లపాడు సీఐ వీరస్వామి తెలిపారు. అంతేగాకుండా రెండు వేల నోట్లపై చిల్డ్రన్స్ కరెన్సీ అని ముద్ర ఉందని వెల్లడించారు. దీంతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సౌత్‌జోన్ డీఎస్పీ కమలాకర్ కోరారు.

Tags:    

Similar News