రియాను బెదిరించిన ఇన్‌స్టా‌ యూజర్లపై కేసు

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. హంతకురాలు, ద్రోహి అనే ముద్ర వేస్తూ తన గురించి మాట్లాడినా సైలెంట్‌గా ఉన్న రియా.. తను కూడా సూసైడ్ చేసుకోకపోతే రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఫైర్ అయింది. అసలు మీరెవరు నన్ను ఇలాంటి మాటలు అనేందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్టప్రకారం నేరమని, ఇలాంటి విషపూరితమైన బెదిరింపులు పునరావృతం కాకుండా ఉండేందుకు […]

Update: 2020-07-20 07:03 GMT

సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య తర్వాత తన గర్ల్ ఫ్రెండ్ రియా చక్రవర్తి.. నెటిజన్ల నుంచి విమర్శలు ఎదుర్కొంది. హంతకురాలు, ద్రోహి అనే ముద్ర వేస్తూ తన గురించి మాట్లాడినా సైలెంట్‌గా ఉన్న రియా.. తను కూడా సూసైడ్ చేసుకోకపోతే రేప్ చేస్తామని, చంపేస్తామని బెదిరింపులు రావడంతో ఫైర్ అయింది. అసలు మీరెవరు నన్ను ఇలాంటి మాటలు అనేందుకు అంటూ ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇది చట్టప్రకారం నేరమని, ఇలాంటి విషపూరితమైన బెదిరింపులు పునరావృతం కాకుండా ఉండేందుకు చర్యలు తీసుకోవాలని సైబర్ క్రైమ్ పోలీసులను కోరింది.

తనను వేధిస్తున్నారంటూ ఇద్దరు ఇన్‌స్టాగ్రామ్ యూజర్లపై ముంబైలోని శాంటాక్రూజ్ పోలీస్ స్టేషన్‌లో శనివారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన పోలీసులు.. ఐపీసీ సెక్షన్ 507, 509, సెక్షన్ 67ల కింద వారిపై కేసు రిజిస్టర్ చేసినట్లు తెలిపారు.

Tags:    

Similar News