నకిలీ ఏసీపీ ముఠా అరెస్టు

దిశ వెబ్ డెస్క్: ఏపీలో ఏసీబీ అధికారుల మంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా రాష్ట్రంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం…ఎస్.జయకృష్ణ అనే వ్యక్తి అనంతపురం- 3 టౌన్ ఏసీబీ అధికారినంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కేసులో ఈ ఏడాది ఫిభ్రవరిలో అరెస్టు అయ్యారు. అక్కడి నుంచి అనంతపురంలోని రెడ్డిపల్లి జిల్లా జైలుకు రిమాండ్ పై వెళ్లాడు. […]

Update: 2020-09-02 06:19 GMT

దిశ వెబ్ డెస్క్: ఏపీలో ఏసీబీ అధికారుల మంటూ బెదిరింపులకు పాల్పడుతున్న ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరంతా రాష్ట్రంలో పలువురు ప్రభుత్వ ఉద్యోగులను బెదిరిస్తూ వారి దగ్గర నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. పోలీసుల వివరాల ప్రకారం…ఎస్.జయకృష్ణ అనే వ్యక్తి అనంతపురం- 3 టౌన్ ఏసీబీ అధికారినంటూ ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన కేసులో ఈ ఏడాది ఫిభ్రవరిలో అరెస్టు అయ్యారు.

అక్కడి నుంచి అనంతపురంలోని రెడ్డిపల్లి జిల్లా జైలుకు రిమాండ్ పై వెళ్లాడు. అక్కడ తమిటిగొల్ల గంగయ్య, జోలదరాసి సోల్మాన్ రాజు,బొడ్డు సాయి కుమార్,హోసూరు నారాయణప్ప గోవిందరాజుల అనే ఖైదీలతో పరిచయం పెంచుకున్నాడు. వీరంతా బయటకు వచ్చాక ఎలాగైనా డబ్బు సంపాదించాలన్న కాంక్షతో ఓ ముఠాగా ఏర్పడ్డారు. రాష్ట్రంలో పలు శాఖల్లో పని చేస్తున్న అధికారుల ఫోన్ నెంబర్లను సేకరించి వారిని ఏసీబీ అధికారుల పేరిట బెదిరింపులకు పాల్పడ్డారు.

ఈ విధంగా రాష్ట్రంలో 60 నుంచి 70 మంది అధికారులను బెదిరించారు. వారి నుంచి సుమారు 14 లక్షల 34 వేల 249 రూపాయలు వసూలు చేశారు. కాగా వీరిపై వైజాగ్, నెల్లూరు, కడప, కర్నూల్, జిల్లాల్లోని పలువురు ప్రభుత్వ అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేశారు. నిందుతులను వారి ఫోన్ కాల్స్ ఆధారంగా ట్రేస్ చేసి అరెస్టు చేశారు. కాగా ఈ కేసులో సమర్థ వంతంగా పని చేసిన కర్నూలు టు టౌన్ సిఐ, ఎస్సై, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అభినందించారు.

Tags:    

Similar News