భైంసా పట్టణంలో పోలీసుల ఫ్లాగ్ మార్చ్
దిశ, ముధోల్: బైంసా పట్టణంలో మంగళవారం సాయంత్రం ప్రముఖ వీధుల గుండా దాదాపు 90 మంది పోలీసుల బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలందరూ శాంతి యూతంగా నిమర్జనం కార్యక్రమానికి సహకరించాలని ఏఎస్పీ కిరణ్ కారే కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ… పట్టణం మొత్తం పూర్తిగా సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సీసీ కెమెరాలో బంధింపబడిన దృశ్యాలు పట్టణంలోని స్టేషన్ కమాండింగ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేయడం లేదని తెలిపారు. […]
దిశ, ముధోల్: బైంసా పట్టణంలో మంగళవారం సాయంత్రం ప్రముఖ వీధుల గుండా దాదాపు 90 మంది పోలీసుల బలగాలతో కవాతు నిర్వహించి ప్రజలందరూ శాంతి యూతంగా నిమర్జనం కార్యక్రమానికి సహకరించాలని ఏఎస్పీ కిరణ్ కారే కోరారు. ఈ సందర్భంగా ఎస్పీ కిరణ్ కారే మాట్లాడుతూ… పట్టణం మొత్తం పూర్తిగా సీసీ కెమెరాలతో ఏర్పాటు చేయడం జరిగిందని, ప్రతి సీసీ కెమెరాలో బంధింపబడిన దృశ్యాలు పట్టణంలోని స్టేషన్ కమాండింగ్ కంట్రోల్ రూమ్ కి కనెక్ట్ చేయడం లేదని తెలిపారు.
నిర్మల్ జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు జిల్లాలో ఎక్కడ కూడా నిమజ్జన కార్యక్రమానికి డీజే పర్మిషన్ లేవని, మండప నిర్వాహకులు ఇట్టి విషయాన్ని గమనించి పోలీసులకు, పట్టణ శాంతికి సహకరించగలరని కోరారు. పైసా పట్టణం నిమజ్జన కార్యక్రమానికి నిర్మల్ జిల్లా పోలీసులే కాకుండా ఆదిలాబాద్, రామగుండం నుండి మొత్తం 350 మంది పోలీసు బలగాలతో బంధింపబడి ఉంటుందని తెలిపారు. నిమజ్జనం రోజున ప్రతి గణేష్ మండపం నిర్వాహకులు గణపతిని మధ్యాహ్నం 12లోపు నిమజ్జన కార్యక్రమానికి సిద్ధం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ సీఐ ప్రవీణ్ కుమార్,ఎస్.ఐ ప్రదీప్, పోలీసు బలగాలు తదితరులు పాల్గొన్నారు.