ఏటీఎంలలో రూ. 1.39 కోట్ల నగదు స్వాహా..

దిశ, జనగామ : జిల్లాలోని పలు ఏటీఎంల నుంచి నలుగురు వ్యక్తులు రూ. 1.39 కోట్ల నగదును స్వాహా చేసిన ఘటనపై జనగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం…. రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రైటర్స్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పి. వెంకటేష్, గుర్రం ఉపేందర్, చైతన్య కుమార్, గట్టు రాజు నలుగురు ఏటీఎం ఆపరేటర్ ఉద్యోగులు వివిధ […]

Update: 2021-02-05 08:55 GMT

దిశ, జనగామ : జిల్లాలోని పలు ఏటీఎంల నుంచి నలుగురు వ్యక్తులు రూ. 1.39 కోట్ల నగదును స్వాహా చేసిన ఘటనపై జనగామ పోలీసులు కేసు నమోదు చేసి దర్యప్తు చేస్తున్నారు. ఈ ఘటనపై సీఐ మల్లేశ్ యాదవ్ తెలిపిన వివరాల ప్రకారం…. రైటర్ బిజినెస్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్, రైటర్స్ సేఫ్ గార్డు ప్రైవేట్ లిమిటెడ్‌కు చెందిన పి. వెంకటేష్, గుర్రం ఉపేందర్, చైతన్య కుమార్, గట్టు రాజు నలుగురు ఏటీఎం ఆపరేటర్ ఉద్యోగులు వివిధ బ్యాంకులకు చెందిన ఏటీఎంలలో డబ్బులు జమ చేస్తుంటారు.

డబ్బులు జమ చేయు సమయంలో అప్పగించిన డబ్బు పూర్తిగా జమ చేయకుండా 1,39,67,900 (ఒక కోటి ముప్పైతోమ్మిది లక్షల అరవై ఏడు వెల తొమ్మిది వందలు) నగదును దొచుకున్నట్లు కంపెనీ ఆడిట్ విభాగం గుర్తించారు. ఈ క్రమంలో కంపెని నిర్వహకులు, ఆడిట్ విభాగం ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా ఈ విషయాన్ని నిందితులు సైతం అంగికరించారు. దర్యాప్తు అనంతరం పూర్తి వివరాలను తెలియజేస్తామని సీఐ తెలిపారు.

Tags:    

Similar News