అయ్యా పోలీస్ సార్.. మీకో న్యాయం.. మాకో న్యాయమా
దిశ, వేములవాడ : రోడ్డు మీద టూ వీలర్‌పై ప్రయాణం చేయాలంటే పోలీసులతో నిత్యం భయంగానే ఉంటుంది. ఎక్కువగా టూ వీల్లరకు ఫైన్లు వేస్తున్నారు. బండి లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేకపోయినా పోలీసులు ఫైన్‌లు వేస్తున్నారు. శనివారం వేములవాడ పట్టణంలో సీసీ ఆఫీస్ నుంచి కోరుట్ల బస్ స్టాండ్ వైపు ఓ పోలీస్ కానిస్టేబుల్ బైక్ మీద హెల్మెట్ లేకుండా, ఒంటి చేత్తో టూవీలర్ నడుపుతూ నెంబర్ ప్లేట్ లేని […]
దిశ, వేములవాడ : రోడ్డు మీద టూ వీలర్‌పై ప్రయాణం చేయాలంటే పోలీసులతో నిత్యం భయంగానే ఉంటుంది. ఎక్కువగా టూ వీల్లరకు ఫైన్లు వేస్తున్నారు. బండి లైసెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇన్సూరెన్స్, పొల్యూషన్, హెల్మెట్, నెంబర్ ప్లేట్ లేకపోయినా పోలీసులు ఫైన్‌లు వేస్తున్నారు. శనివారం వేములవాడ పట్టణంలో సీసీ ఆఫీస్ నుంచి కోరుట్ల బస్ స్టాండ్ వైపు ఓ పోలీస్ కానిస్టేబుల్ బైక్ మీద హెల్మెట్ లేకుండా, ఒంటి చేత్తో టూవీలర్ నడుపుతూ నెంబర్ ప్లేట్ లేని వాహనంపై దర్జాగా వెళ్తున్నాడు.
ఓ బాధ్యత గల పోలీసు నిబంధనలకు విరుద్ధంగా ప్రయాణం చేయడం ఎంతవరకు కరెక్ట్ అని వాహనదారులు ఆరోపిస్తున్నారు. పోలీసులకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నిస్తున్నారు.