అనుకున్నట్టే పోలీస్ అయ్యాడు.. కానీ, అంతలోనే..!

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూర్ గ్రామానికి చెందిన యువ కానిస్టేబుల్ భూమేష్ (25) ప్రమాదవశాత్తు బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతుడు భూమేష్ ఇటీవలే పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 4 నాలుగు నెలల కిందట సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అందకూర్ గ్రామానికి వచ్చిన అతను ఇంట్లో ఎలక్ట్రానిక్ మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు […]

Update: 2021-11-17 06:09 GMT
అనుకున్నట్టే పోలీస్ అయ్యాడు.. కానీ, అంతలోనే..!
  • whatsapp icon

దిశ, ముధోల్ : నిర్మల్ జిల్లా కుంటాల మండలం అందకూర్ గ్రామానికి చెందిన యువ కానిస్టేబుల్ భూమేష్ (25) ప్రమాదవశాత్తు బుధవారం మృతి చెందాడు. కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మృతుడు భూమేష్ ఇటీవలే పోలీస్ ట్రైనింగ్ పూర్తి చేసుకుని 4 నాలుగు నెలల కిందట సిరిసిల్లలోని 17వ బెటాలియన్‌లో విధులు నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలోనే అందకూర్ గ్రామానికి వచ్చిన అతను ఇంట్లో ఎలక్ట్రానిక్ మోటార్ రిపేర్ చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఎంతో కష్టపడి పోలీసు ఉద్యోగం సాధించిన తమ కొడుకు సెలవులపై ఇంటికొచ్చి ఇలా ప్రమాదంలో ప్రాణాలు కోల్పోతాడని అనుకోలేదని బాధిత పేరెంట్స్ శోకసంద్రంలో మునిగిపోయారు. భూమేష్ మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Tags:    

Similar News