పంద్రాగస్టు రోజు హుజురాబాద్‌లో విషాదం

దిశ, హుజురాబాద్: ఇండిపెండెన్స్ డే రోజు హుజారాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం నింపింది. పంద్రాగస్టు సందర్భంగా డ్యూటీ చేసేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వీణవంక మండలం కనపర్తికి చెందిన కానిస్టేబుల్ లోకిని తిరుపతి సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ చేసేందుకు శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో బైక్ పై […]

Update: 2020-08-15 01:10 GMT
పంద్రాగస్టు రోజు హుజురాబాద్‌లో విషాదం
  • whatsapp icon

దిశ, హుజురాబాద్: ఇండిపెండెన్స్ డే రోజు హుజారాబాద్ లో విషాదం చోటు చేసుకుంది. ఓ రోడ్డు ప్రమాదం కానిస్టేబుల్ కుటుంబంలో విషాదం నింపింది. పంద్రాగస్టు సందర్భంగా డ్యూటీ చేసేందుకు బైక్ పై వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

పోలీసుల కథనం ప్రకారం… కరీంనగర్ జిల్లా హుజురాబాద్ మండలం వీణవంక మండలం కనపర్తికి చెందిన కానిస్టేబుల్ లోకిని తిరుపతి సిరిసిల్ల జిల్లాలో విధులు నిర్వర్తిస్తున్నారు. డ్యూటీ చేసేందుకు శనివారం తెల్లవారు జామున 4 గంటల ప్రాంతంలో బైక్ పై బయలుదేరాడు. హుజురాబాద్ సమీపంలోని ఇందిరానగర్, శాలపల్లి సమీపంలో డివైడర్ ను ఢీ కొని మృతిచెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామని తెలిపారు.

Tags:    

Similar News