కార్టూన్ క్యారెక్టర్‌కు కాలేజ్‌లో టాప్ ర్యాంక్!
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల టైమ్‌లో ఓటర్ల లిస్టు చూస్తే.. బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి. పల్లెటూర్లలోనూ ఓటర్ల లిస్టులో బాలీవుడ్ హీరోల పేర్లు కనిపిస్తుంటాయి. అంతెందుకు ఆ జాబితాలో జంతువులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఇదంతా పక్కనబెడితే, ఇప్పుడు కాలేజీ మెరిట్ లిస్టులోనూ ఈ తరహా తప్పులు దొర్లుతున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాళ్‌లోని అశుతోష్ కాలేజ్.. బీఏ ఇంగ్లీష్ అడ్మిషన్ లిస్టును ప్రకటించగా.. అందులో టాప్‌లో సన్నిలియోన్ పేరు కనిపించిన విషయం తెలిసిందే. అందుకు సన్నీ […]
దిశ, వెబ్‌డెస్క్ : ఎన్నికల టైమ్‌లో ఓటర్ల లిస్టు చూస్తే.. బోలెడన్ని తప్పులు కనిపిస్తాయి. పల్లెటూర్లలోనూ ఓటర్ల లిస్టులో బాలీవుడ్ హీరోల పేర్లు కనిపిస్తుంటాయి. అంతెందుకు ఆ జాబితాలో జంతువులకు కూడా ఓటు హక్కు ఉంటుంది. ఇదంతా పక్కనబెడితే, ఇప్పుడు కాలేజీ మెరిట్ లిస్టులోనూ ఈ తరహా తప్పులు దొర్లుతున్నాయి. ఇటీవలే పశ్చిమ బెంగాళ్‌లోని అశుతోష్ కాలేజ్.. బీఏ ఇంగ్లీష్ అడ్మిషన్ లిస్టును ప్రకటించగా.. అందులో టాప్‌లో సన్నిలియోన్ పేరు కనిపించిన విషయం తెలిసిందే. అందుకు సన్నీ కూడా స్పందించి.. ‘నెక్ట్స్ సెమిస్టర్‌లో కాలేజీలో కలుద్దాం! మీరంతా నా క్లాసులో ఉంటారని ఆశిస్తున్నాను’ అంటూ సర్కాస్టిక్ సమాధానమిచ్చింది. ఆ తర్వాత సింగర్ నేహా కక్కర్ పేరు బెంగాళ్‌లోని మానిక్‌చక్ కాలేజీ మెరిట్ లిస్ట్‌లో దర్శనమిచ్చింది. ఇక తాజాగా మరో బెంగాళ్ కాలేజ్ తమ మెరిట్ లిస్టులో జపాన్ కార్టూన్ క్యారెక్టర్‌కు నెంబర్ వన్ పొజిషన్ ఇచ్చింది.
జపాన్‌కు చెందిన ఫేమస్ కార్టూన్ క్యారెక్టర్ ‘షించాన్’. ఈ చిన్నోడిని చిన్నారులే కాదు.. పెద్దోళ్లు కూడా చాలా ఇష్టపడుతుంటారు. అయితే ఈ కార్టూన్ కారెక్టర్ పేరు.. పశ్చిమ బెంగాల్‌లోని సిలిగురి కాలేజీ ప్రకటించిన బీఎస్సీ(హానర్స్) మెరిట్ లిస్ట్‌లో టాప్‌లో కనిపించింది. ఈ విషయం తెలిసిన కాలేజీ యాజమాన్యం వెంటనే ఆ లిస్ట్‌ను తొలగించింది. అయితే, కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఈ ఏడాది అడ్మిషన్లు ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం సూచించింది. ఈ క్రమంలో కొంతమంది ఆకతాయిలు వేరే వేరే పేర్లతో దరఖాస్తు చేస్తున్నారు. ఈ కారణంగానే.. ఇటీవల సన్నిలియోన్, నేహా కక్కర్ పేర్లు కనిపించాయి. దీంతో ఆయా కాలేజీ యాజమాన్యాలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సైబర్ క్రైమ్ విభాగం కూడా దీన్ని చాలా సీరియస్‌గా తీసుకుంది.
బాలీవుడ్ హాట్ బ్యూటీ సన్నీ లియోన్ పేరు ఇప్పుడే కాదు.. గతంలోనూ పలుమార్లు హాట్ టాపిక్‌గా నిలిచింది. బీహార్ జాయింట్ ఇంజనీరింగ్ మెరిట్ లిస్టులోనూ 98.5 శాతం మార్కులతో సన్నీ టాప్‌లో నిలిచినట్లు ఫలితాలు వెలువడ్డాయి. కాగా, విద్యార్థుల జీవితాలకు సంబంధించిన ఇలాంటి విషయాల్లో యాజమాన్యాలు జాగ్రత్తగా ఉండాలని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.