టీఆర్ఎస్, బీజేపీ నేతల మధ్య గొడవ.. పోలీసుల లాఠీచార్జ్

దిశ, అచ్చంపేట : అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం తారా స్థాయికి చేరుకున్నది. ఈ క్రమంలోనే శనివారం అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై తెలుగు తల్లి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. వాహనదారుల రాకపోకలు ఇబ్బందులు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు వాహనాలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తుండగా అదే సమయంలో.. టీఆర్ఎస్ నాయకులు అటునుంచి త్వరగా వెళ్లాలని.. బీజేపీ నాయకులు గట్టిగా అరిచారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ […]

Update: 2021-04-24 10:25 GMT

దిశ, అచ్చంపేట : అచ్చంపేట మున్సిపల్ ఎన్నికల్లో ప్రచారం తారా స్థాయికి చేరుకున్నది. ఈ క్రమంలోనే శనివారం అచ్చంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్ ప్రధాన రహదారిపై తెలుగు తల్లి విగ్రహం వద్ద బీజేపీ నాయకులు ప్రచారాన్ని కొనసాగిస్తుండగా.. వాహనదారుల రాకపోకలు ఇబ్బందులు తలెత్తాయి.

ఈ నేపథ్యంలో బీజేపీ నాయకులు వాహనాలు వెళ్లేందుకు రూట్ క్లియర్ చేస్తుండగా అదే సమయంలో.. టీఆర్ఎస్ నాయకులు అటునుంచి త్వరగా వెళ్లాలని.. బీజేపీ నాయకులు గట్టిగా అరిచారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఇరు పార్టీల నాయకులు ఒకరినొకరు తోసుకున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు ఇరు పార్టీల నాయకులకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. వారు వినకపోవడంతో పోలీసులు తమ లాఠీలకు పని కల్పించారు. అనంతరం స్వల్ప లాఠీచార్జ్ చేశారు. ఈ సంఘటనలో సుమారు పది మందికి గాయాలు అయినట్లు సమాచారం.

 

Tags:    

Similar News