రక్షించండని డయల్ 100 కి కాల్స్.. అరగంట తర్వాతొచ్చిన పోలీసులు

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ఆపదలో ఉన్నాం.. రక్షించండని డయల్ 100 కి కాల్ చేస్తే 5 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుంటారని పోలీస్ శాఖ చెబుతుంది. అయితే క్షేత్రస్థాయిలో అది అమలవుతుందా అనే ప్రశ్నకు భిన్న సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఘటన ప్రజలకు ‘డయల్ 100’పై నమ్మకాన్ని పోగొట్టేవిధంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలోని హునుమాన్ నగర్‌లో […]

Update: 2021-11-15 08:38 GMT
రక్షించండని డయల్ 100 కి కాల్స్.. అరగంట తర్వాతొచ్చిన పోలీసులు
  • whatsapp icon

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్ మహానగరంలో ఆపదలో ఉన్నాం.. రక్షించండని డయల్ 100 కి కాల్ చేస్తే 5 నిమిషాల్లోనే ఘటనాస్థలానికి పోలీసులు చేరుకుంటారని పోలీస్ శాఖ చెబుతుంది. అయితే క్షేత్రస్థాయిలో అది అమలవుతుందా అనే ప్రశ్నకు భిన్న సమాధానాలు వ్యక్తమవుతున్నాయి. ఆదివారం హైదరాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన ఘటన ప్రజలకు ‘డయల్ 100’పై నమ్మకాన్ని పోగొట్టేవిధంగా ఉందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. కీసర పోలీస్ స్టేషన్ పరిధి నాగారంలోని హునుమాన్ నగర్‌లో ఆదివారం గృహప్రవేశ కార్యక్రమం జరిగింది. పూజ జరుగుతుండగా.. గుంపుగా వచ్చిన హిజ్రాల వేశంలో వచ్చి డబ్బులివ్వాలంటూ ఇంట్లోకి ప్రవేశించి గొడవకు దిగారు. దీంతో హడలెత్తిన బాధితులు వెంటనే డయల్ 100 కి కాల్ చేశారు. అలా.. ఉదయం 5.35, 5.48, 5.57 కి వరుసగా ఫోన్ చేసి మొరపెట్టుకున్నా స్పందన లేదు. చివరకి పెట్రోలింగ్ వాహనం ఘటనా స్థలానికి చేరుకోగా.. అది చూసి వారంతా పరిగెత్తారు. ఇలా ప్రమాదంలో ఉన్నామని చెప్పినా స్పందించకపోవడంతో మరింత భయాందోళన చెందినట్లు బాధితులు వాపోయారు.

Tags:    

Similar News