నకిలీ ‘పసిడి’ తాకట్టు..
నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకులను మోసం చేసిన కేసులో చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 15ఖాతాల ద్వారా నకిలీ నగలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి రూ.కోటి20లక్షల మేర రుణం పొందినట్టు పోలీసులు నిర్దారించారు. బ్యాంకుల అంతర్గత తనిఖీల్లో ఈ విషయం వెల్లడి కాగా వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అతడు తాకట్టు పెట్టిన 5కిలోల […]
నకిలీ బంగారు ఆభరణాలు తాకట్టు పెట్టి బ్యాంకులను మోసం చేసిన కేసులో చిత్తూరు కో ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ మాజీ చైర్మన్ షణ్ముగంను మంగళవారం పోలీసులు అరెస్టు చేశారు. 15ఖాతాల ద్వారా నకిలీ నగలను వివిధ బ్యాంకుల్లో డిపాజిట్ చేసి రూ.కోటి20లక్షల మేర రుణం పొందినట్టు పోలీసులు నిర్దారించారు. బ్యాంకుల అంతర్గత తనిఖీల్లో ఈ విషయం వెల్లడి కాగా వారు పోలీసులను ఆశ్రయించినట్టు తెలుస్తోంది. దీంతో రంగ ప్రవేశం చేసిన పోలీసులు అతడు తాకట్టు పెట్టిన 5కిలోల నకిలీ ఆభరణాలు, పలు కీలక సాక్ష్యాలను సేకరించారు. నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్టు పోలీసులు వెల్లడించారు.ఇదిలా ఉండగా ఈ రుణాల సేకరణలో బ్యాంకు అధికారులు ఎవరిదైనా హస్తముందా అనే కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నట్టు వారు తెలిపారు.