34 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కరకంబాడి రోడ్డులోని టీఎన్ఆర్ కల్యాణ మండపం సమీపంలోని అడవుల్లో వాహనాల్లో లోడింగ్ చేస్తున్న 34 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే.. కరకంబాడి రోడ్డులోని కల్యాణమండపం దగ్గర్లోని అడవుల్లో ఎర్ర చందనం దుంగలను స్మగ్లర్లు వాహనాల్లో తరలిస్తున్నారంటూ పోలీసులకు సమాచారమందింది. సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జీ పి. రవిశంకర్, ఆర్ఎస్ఐ వాసు, కృపానంద, లక్ష్మణ్ తదితర సిబ్బందితో ఆ పరిసరాల్లో కూంబింగ్ చేపట్టారు. బ్యాంకు […]
చిత్తూరు జిల్లా తిరుపతి సమీపంలోని కరకంబాడి రోడ్డులోని టీఎన్ఆర్ కల్యాణ మండపం సమీపంలోని అడవుల్లో వాహనాల్లో లోడింగ్ చేస్తున్న 34 ఎర్ర చందనం దుంగలను టాస్క్ ఫోర్స్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. దీని వివరాల్లోకి వెళ్తే.. కరకంబాడి రోడ్డులోని కల్యాణమండపం దగ్గర్లోని అడవుల్లో ఎర్ర చందనం దుంగలను స్మగ్లర్లు వాహనాల్లో తరలిస్తున్నారంటూ పోలీసులకు సమాచారమందింది. సమాచారమందుకున్న టాస్క్‌ఫోర్స్ ఇన్‌ఛార్జీ పి. రవిశంకర్, ఆర్ఎస్ఐ వాసు, కృపానంద, లక్ష్మణ్ తదితర సిబ్బందితో ఆ పరిసరాల్లో కూంబింగ్ చేపట్టారు. బ్యాంకు కాలనీ సమీపంలోని అడవి మార్గం నుంచి సుమారు ఇరవై మంది స్మగ్లర్లు ఎర్రచందనం దుంగలను మోసుకొచ్చి వాహనాలలో లోడింగ్ చేస్తూ కనిపించారు.
వెంటనే టాస్క్ ఫోర్స్ బృందం వారిని చుట్టు ముట్టడంతో స్మగ్లర్లు తిరగబడి దాడికి దిగారు. ఈ పెనుగులాటలో కానిస్టేబుల్ శ్రీనుకు గాయాలయ్యాయి. మెజారిటీ స్మగ్లర్లు పరారవ్వగా ఐదుగుర్ని మాత్రం పోలీసులు పట్టుకోగలిగారు. వారిని వడమాలపేటకు చెందిన గురక భానుప్రకాష్(33), కడప జిల్లాకు చెందిన హరి(20), చందు వెంకటేష్ (40), గండికోట సురేష్( 22), గొండి కిరణ్(22)లుగా గుర్తించారు. వారి నుంచి 34 ఎర్ర చందనం దుంగలు, రెండు కార్లు, ఒక ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.