వ్యాక్సిన్ ఫస్ట్ డోసు తీసుకున్న స్పీకర్…
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పుష్ప కూడా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కరోనా చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకి లక్షలాది మంది మరణాలకు కారణమైందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగోవడంలో ప్రపపంచ దేశాలు కూడా ఏమీ చేయలేకపోయాయని అన్నారు. కానీ రాష్ట్రానికి చెందిన భారత్ […]
దిశ,వెబ్‌డెస్క్: తెలంగాణలో రెండో దశ వ్యాక్సినేషన్ కొనసాగుతోంది. బుధవారం నిమ్స్ ఆస్పత్రిలో తెలంగాణ శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డి వ్యాక్సిన్ తొలి డోస్ తీసుకున్నారు. ఆయనతో పాటు ఆయన సతీమణి పుష్ప కూడా తొలి డోసు వ్యాక్సిన్ తీసుకున్నారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ…కరోనా చైనాలో మొదలై ప్రపంచ దేశాలకు పాకి లక్షలాది మంది మరణాలకు కారణమైందన్నారు. కరోనాకు వ్యాక్సిన్ కనుగోవడంలో ప్రపపంచ దేశాలు కూడా ఏమీ చేయలేకపోయాయని అన్నారు. కానీ రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ కరోనాకు తొలిసారిగా వ్యాక్సిన్ కనుగొని ప్రపంచానికి అందించిందని ప్రశంసించారు.
కాగా మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కూడా నిమ్స్‌లో వ్యాక్సిన్ తీసుకోగా.. డిప్యూటీ స్పీకర్ టీ.పద్మారావు గౌడ్ సికింద్రాబాద్ ఆస్పత్రిలో వ్యాక్సిన్ డోసు తీసుకున్నారు. ఇక తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ఈ నెల1న వ్యాక్సిన్ తీసుకున్న సంగతి తెలిసిందే.