వాట్సాప్ యూనివర్సిటీ డిగ్రీతో..అంతే మరి !

            జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అరెస్టుపై తన చర్యల్ని సమర్థించుకునేందుకు ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘సెటైరికల్ వెబ్‌సైట్’ వార్తపై ఒకరోజు తర్వాత కాంగ్రెస్ స్పందించింది. ‘వాట్సాప్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందితే ఇలాగే ఉంటుందని’ మోడీని పరిహసించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తే.. భూకంపం వచ్చి భారత్ నుంచి కశ్మీర్ వేరవుతుందని ఒమర్ అబ్దుల్లా అన్నట్టుగా ఫేకింగ్ న్యూస్ వార్తను పార్లమెంట్‌లో ప్రస్తావించి తన చర్యలను […]

Update: 2020-02-07 08:40 GMT

జమ్మూ కశ్మీర్ మాజీ సీఎం ఒమర్ అబ్దుల్లా అరెస్టుపై తన చర్యల్ని సమర్థించుకునేందుకు ప్రధాని మోడీ ప్రస్తావించిన ‘సెటైరికల్ వెబ్‌సైట్’ వార్తపై ఒకరోజు తర్వాత కాంగ్రెస్ స్పందించింది. ‘వాట్సాప్ యూనివర్సిటీ నుంచి డిగ్రీ పొందితే ఇలాగే ఉంటుందని’ మోడీని పరిహసించింది. కశ్మీర్‌లో ఆర్టికల్ 370ని తొలగిస్తే.. భూకంపం వచ్చి భారత్ నుంచి కశ్మీర్ వేరవుతుందని ఒమర్ అబ్దుల్లా అన్నట్టుగా ఫేకింగ్ న్యూస్ వార్తను పార్లమెంట్‌లో ప్రస్తావించి తన చర్యలను సమర్థించుకోబోయారు. ఈ ఫేక్ వార్తపై కాంగ్రెస్ మోడీని ఎగతాళి చేసింది. కాగా ఒమర్ అబ్దు్ల్లా అటువంటి ప్రకటనలేవీ చేయలేదని నేషనల్ కాన్ఫరెన్స్ అధికార ప్రతినిధి ఇమ్రాన్ దార్ గురువారం ఎన్డీటీవీతో తెలిపారు.

Tags:    

Similar News