పశ్చిమ బెంగాల్, అసోంలో మోదీ పర్యటన
దిశ, వెబ్‌డెస్క్: నేడు పశ్చిమ బెంగాల్, అసోంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని సందర్శించనున్నారు. నేతాజీపై వెలువడిన 21వ శతాబ్దపు వారసత్వ పత్రాలు ప్రధాని మోదీ పరిశీలించనున్నారు. అనంతరం కోల్‌కతాలో కళాకారులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో నిర్వహిస్తున్న ‘పరాక్రమ్ దివస్’ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా జరపాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. నేతాజీకి నివాళిగా ప్రతిఏటా జనవరి 23న పరాక్రమ్ దివస్ […]
దిశ, వెబ్‌డెస్క్: నేడు పశ్చిమ బెంగాల్, అసోంలో ప్రధాని నరేంద్ర మోదీ పర్యటించనున్నారు. కోల్‌కతాలోని నేషనల్ లైబ్రరీని సందర్శించనున్నారు. నేతాజీపై వెలువడిన 21వ శతాబ్దపు వారసత్వ పత్రాలు ప్రధాని మోదీ పరిశీలించనున్నారు.
అనంతరం కోల్‌కతాలో కళాకారులతో ప్రధాని మోదీ మాట్లాడనున్నారు. నేతాజీ జయంతిని పురస్కరించుకుని కోల్‌కతాలో నిర్వహిస్తున్న ‘పరాక్రమ్ దివస్’ వేడుకల్లో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. జనవరి 23ను పరాక్రమ్ దివస్‌గా జరపాలని ఇటీవల కేంద్రం నిర్ణయించింది. నేతాజీకి నివాళిగా ప్రతిఏటా జనవరి 23న పరాక్రమ్ దివస్ నిర్వహించనున్నారు.
కోల్‌కతా విక్టోరియా మెమోరియల్‌లో పరాక్రమ్ దివస్ వేడుకలు నిర్వహిస్తున్నారు. నేతాజీ జీవిత చరిత్రపై ప్రదర్శన, ప్రొజెక్షన్ మ్యాపింగ్ షో ప్రారంభించనున్నారు. స్మారక నాణెం, తపాలా బిళ్లను ప్రధాని మోదీ విడుదల చేయనున్నారు. ప్రత్యేక ఆకర్షణగా ‘అమ్రా నూతన్ జౌబొనెరి డూట్’ బంగాలీ కార్యక్రమం నిర్వహించనున్నారు. అనంతరం అసోంలో భూపట్టాల పంపిణీలో ప్రధాని మోదీ పాల్గొననున్నారు. అసోం శివసాగర్‌లో లక్షమందికి భూకేటాయింపు ధృవీకరణ పత్రాలను పంపిణీ చేయనున్నారు.