11న సీఎంలతో పీఎం వీడియో కాన్ఫరెన్స్
న్యూఢిల్లీ: ఈ నెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీకి అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహంపై చర్చించనున్నారు. శుక్రవారం దేశవ్యాప్తంగా రెండోసారి డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అత్యవసరంగా వినియోగించడానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు డీసీజీఐ అనుమతులనిచ్చింది. మొదటి దఫాలో భాగంగా 30 […]
న్యూఢిల్లీ: ఈ నెల 11న అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించనున్నారు. సోమవారం సాయంత్రం 4 గంటలకు ఈ భేటీ ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో ప్రస్తుతం దేశంలో నెలకొన్న కరోనా పరిస్థితులపై మాట్లాడనున్నారు. దేశవ్యాప్తంగా టీకా పంపిణీకి అనుసరించాల్సిన పద్ధతులు, వ్యూహంపై చర్చించనున్నారు.
శుక్రవారం దేశవ్యాప్తంగా రెండోసారి డ్రై రన్ నిర్వహించిన సంగతి తెలిసిందే. అత్యవసరంగా వినియోగించడానికి కొవిషీల్డ్, కొవాగ్జిన్ టీకాలకు డీసీజీఐ అనుమతులనిచ్చింది. మొదటి దఫాలో భాగంగా 30 కోట్ల మంది వైద్య సిబ్బంది, ఫ్రంట్‌లైన్ వారియర్లకు టీకా వేయాలని కేంద్రం నిర్ణయించింది. రోజుల వ్యవధిలోనే టీకా పంపిణీ మొదలవుతుందని కేంద్ర మంత్రి పేర్కొనడం గమనార్హం.