భారత ఒలింపిక్ అథ్లెట్లకు మోడీ సందేశం

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసి దేశానికి పేరు తీసుకొని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ నెల 23న ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల బృందం 17న బయలుదేరనున్నది. ఈ నేపథ్యంలో మోడీ వర్చువల్ విధానంలో వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌కు వెళ్లనున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపి వారిలో స్పూర్తిని నింపారు. ‘మీ వెనుక దేశం మొత్తం అండగా ఉన్నది. అంచనాలను పక్కన పెట్టి […]

Update: 2021-07-13 09:14 GMT

దిశ, స్పోర్ట్స్: టోక్యో ఒలింపిక్స్‌కు వెళ్లనున్న భారత అథ్లెట్లు మంచి ప్రదర్శన చేసి దేశానికి పేరు తీసుకొని రావాలని ప్రధాని నరేంద్ర మోడీ అన్నారు. ఈ నెల 23న ప్రారంభం కానున్న టోక్యో ఒలింపిక్స్ కోసం భారత అథ్లెట్ల బృందం 17న బయలుదేరనున్నది. ఈ నేపథ్యంలో మోడీ వర్చువల్ విధానంలో వారితో మాట్లాడారు. ఒలింపిక్స్‌కు వెళ్లనున్న అథ్లెట్లకు శుభాకాంక్షలు తెలిపి వారిలో స్పూర్తిని నింపారు.

‘మీ వెనుక దేశం మొత్తం అండగా ఉన్నది. అంచనాలను పక్కన పెట్టి మీరు రాణించి పతకాలు తీసుకొని రావాలి. అంతర్జాతీయ అత్యున్నత క్రీడా వేదికపై మన భారత పతాకాన్ని రెపరెపలాడించాలి’ అని మోడీ ఆకాంక్షించారు. సీనియర్ క్రీడాకారులైన మేరీ కోమ్, పీవీ సింధు, సౌరభ్ చౌదరిలతో మోడీ ప్రత్యేకంగా మాట్లాడారు. 118 మంది అథ్లెట్లతో పాటు ఇతర సిబ్బంది కలసి మొత్తం 228 మంది టోక్యోకు పయనం కానున్నారు. భారత దేశం యావత్ వీరందరికీ తోడుగా ఉండాలని.. మన అథ్లెట్లు విశ్వక్రీడల్లో మంచిగా రాణించేలా తగినంత స్పూర్తిని వారికి ఇవ్వాలని మోడీ కోరారు.

Tags:    

Similar News