మౌలిక వసతులకు పెద్దపీట వేశాం: మోడీ

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలకు న్యాయం చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్న మోడీ.. బడ్జెట్‌లో మౌలిక వసతులకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌కు బడ్జెట్‌ విజన్‌లా పనిచేస్తుందని, పారదర్శకతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై బడ్జెట్ దృష్టి సారించిందని […]

Update: 2021-02-01 04:54 GMT

దిశ, వెబ్‌డెస్క్: కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశ ప్రజలకు న్యాయం చేసేలా ఉందని ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యానించారు. అన్ని వర్గాలను సంతృప్తి పరిచేలా బడ్జెట్ ఉందన్న మోడీ.. బడ్జెట్‌లో మౌలిక వసతులకు పెద్దపీట వేశామని పేర్కొన్నారు. ఆత్మ నిర్భర్ భారత్‌కు బడ్జెట్‌ విజన్‌లా పనిచేస్తుందని, పారదర్శకతతో కూడిన బడ్జెట్‌ను ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. అసాధారణ పరిస్థితుల నేపథ్యంలో 2021-22 బడ్జెట్‌ను ప్రవేశపెట్టడం జరిగిందని, రైతుల ఆదాయం రెట్టింపు చేయడంపై బడ్జెట్ దృష్టి సారించిందని పేర్కొన్నారు. అగ్రికల్చర్ ఇన్‌ఫ్రాస్టక్చర్ ఫండ్ సాయంతో ఏపీఎంసీ మార్కెట్లు పటిష్టమవుతాయన్నారు.

Tags:    

Similar News