ఆ సైకిల్ గర్ల్ సాహసాన్ని మాటల్లో వర్ణించలేము: మోడీ

దిశ,వెబ్‌డెస్క్: బీహార్‌‌లోని దర్బాంగకు చెందిక సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిని బాల పురస్కార్ అవార్డు వరించింది. లాక్ డౌన్ సమయంలో జబ్బుతో ఉన్న తన తండ్రిని సొంత ఊరుకు చేర్చేందుకు 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన ఆమె దైర్యానికి ఈ అవార్డు దక్కింది. బాల పురస్కార్ దక్కించుకున్నందుకు బీహార్ దర్బాంగ్ గర్ల్ జ్యోతి కుమారీకి శుభాకాంక్షలు అని ప్రధాని మోడీ సోమవారం ట్వీట్ చేశారు. ఆమె తన వయసులో ఉన్న అందరు బాలికల్లాగే సామాన్యంగా కనిపించవచ్చు. […]

Update: 2021-01-25 11:08 GMT
ఆ సైకిల్ గర్ల్ సాహసాన్ని మాటల్లో వర్ణించలేము: మోడీ
  • whatsapp icon

దిశ,వెబ్‌డెస్క్: బీహార్‌‌లోని దర్బాంగకు చెందిక సైకిల్ గర్ల్ జ్యోతి కుమారిని బాల పురస్కార్ అవార్డు వరించింది. లాక్ డౌన్ సమయంలో జబ్బుతో ఉన్న తన తండ్రిని సొంత ఊరుకు చేర్చేందుకు 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన ఆమె దైర్యానికి ఈ అవార్డు దక్కింది. బాల పురస్కార్ దక్కించుకున్నందుకు బీహార్ దర్బాంగ్ గర్ల్ జ్యోతి కుమారీకి శుభాకాంక్షలు అని ప్రధాని మోడీ సోమవారం ట్వీట్ చేశారు.

ఆమె తన వయసులో ఉన్న అందరు బాలికల్లాగే సామాన్యంగా కనిపించవచ్చు. కానీ ఆమె చూపిన తెగువ, 1200 కిలోమీటర్లు సైకిల్ పై ప్రయాణించిన ఆమె స్థైర్యం..అది కూడా జబ్బుతో తన తండ్రిని సైకిల్ పై ఎక్కించుకొని వెళ్లడం మాములు విషయం కాదన్నారు. ఆమె సాహసాన్ని మాటల్లో వర్ణించలేమని ప్రధాని మోడీ ట్వీట్ చేశారు.

Tags:    

Similar News