మాజీ రాష్ట్రపతులు, పీఎంలతో మోడీ మంతనాలు

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అమల్లో ఉండగా ప్రధాని మోడీ కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణపై మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, ప్రతిపక్ష నేతలతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు 3,400 చేరుతున్న తరుణంలో ప్రధాని వీరితో సంభాషించినట్టు సమాచారం అందింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలతో ప్రధాని మాట్లాడారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ, […]

Update: 2020-04-05 08:20 GMT
మాజీ రాష్ట్రపతులు, పీఎంలతో మోడీ మంతనాలు
  • whatsapp icon

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా 21 రోజుల లాక్ డౌన్ అమల్లో ఉండగా ప్రధాని మోడీ కరోనా మహమ్మారి వ్యాప్తి నియంత్రణపై మాజీ రాష్ట్రపతులు, మాజీ ప్రధానులు, ప్రతిపక్ష నేతలతో మాట్లాడారు. దేశంలో కరోనా కేసులు 3,400 చేరుతున్న తరుణంలో ప్రధాని వీరితో సంభాషించినట్టు సమాచారం అందింది. కొన్ని వర్గాల సమాచారం ప్రకారం.. మాజీ రాష్ట్రపతులు ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, మాజీ ప్రధానులు మన్మోహన్ సింగ్, దేవేగౌడలతో ప్రధాని మాట్లాడారు. వీరితో పాటు కాంగ్రెస్ అధ్యక్షులు సోనియా గాంధీ, పశ్చిమ బెంగాల్ సీఎం మమత బెనర్జీ, ఒడిషా సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణ సీఎం కే చంద్రశేఖర రావు సహా డీఎంకే చీఫ్ ఎంకే స్టాలిన్, సమాజ్ వాదీ పార్టీ నేతలు ములాయం సింగ్ యాదవ్, అఖిలేష్ యాదవ్, శిరోమణి అకాలీదళ్ చీఫ్ ప్రకాశ్ సింగ్ బాదల్ లతో కరోనా మహమ్మారిపై చర్చించారు. ఏప్రిల్ 8న పలు పార్టీల ఫ్లోర్ లీడర్లతో పీఎం మోడీ చర్చించనున్న విషయం తెలిసిందే.

Tags: Coronavirus, pm, dialled, talks, former president, opposition parties

Tags:    

Similar News