కరోనాపై ప్రధాని మోడీ ఉన్నతస్థాయి భేటీ
న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ తీరు, సమస్యలపై ఇందులో ప్రస్తావించినట్టు తెలిసింది. క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సహా సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు. కరోనా కేసులు ఈ ఏడాదిలోనే అత్యధికంగా అంటే 93,249 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు […]
న్యూఢిల్లీ : కరోనా కేసులు పెరుగుతుండటంతో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆదివారం ఉన్నతస్థాయి సమావేశాన్ని నిర్వహించారు. కరోనా కేసుల పెరుగుదల, వ్యాక్సినేషన్ తీరు, సమస్యలపై ఇందులో ప్రస్తావించినట్టు తెలిసింది. క్యాబినెట్ సెక్రెటరీ రాజీవ్ గౌబా, పీఎం ప్రిన్సిపల్ సెక్రెటరీ, ఆరోగ్య కార్యదర్శి రాజేశ్ భూషణ్, నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ సహా సీనియర్ అధికారులు ఈ భేటీలో పాల్గొన్నారు.
కరోనా కేసులు ఈ ఏడాదిలోనే అత్యధికంగా అంటే 93,249 కేసులు నమోదైన సంగతి తెలిసిందే. దాదాపు గతేడాది పీక్ స్టేజ్‌కు కేవలం రోజుల వ్యవధిలోనే చేరనున్న తరుణంలో ప్రధాని మోడీ ఈ సమావేశాన్ని నిర్వహించడం గమనార్హం.