పీకే నోట..‘బాత్ బీహారీ కీ’ నినాదం
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించారు. ఇవాళ ఆయన పాట్నాలో మీడియాతో మాట్లా డారు. ‘‘బాత్ బీహార్ కీ’’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. ‘ వేలాది మంది యువకులతో ఓ రాజకీయ శక్తిని సృష్టిస్తాం. ఎన్నికల్లో పోటీయే కాదు… బీహార్ అభివృద్ధికి పాటుపడుతాం’. అంటూ ప్రశాంత్ కిషోర్ మీడియా ముందు వెల్లడించారు. అంతకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే నిప్పులు చెరిగారు. జేడీయూ-బీజేపీ పొత్తుతో బీహార్‌కు ఒరిగిందేంలేదన్నారు. నితీష్ […]
ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ తన భవిష్యత్తు కార్యచరణ ప్రకటించారు. ఇవాళ ఆయన పాట్నాలో మీడియాతో మాట్లా డారు. ‘‘బాత్ బీహార్ కీ’’ నినాదంతో ప్రజల్లోకి వెళ్తామన్నారు. ‘ వేలాది మంది యువకులతో ఓ రాజకీయ శక్తిని సృష్టిస్తాం. ఎన్నికల్లో పోటీయే కాదు… బీహార్ అభివృద్ధికి పాటుపడుతాం’. అంటూ ప్రశాంత్ కిషోర్ మీడియా ముందు వెల్లడించారు. అంతకు ముందు బీహార్ సీఎం నితీష్ కుమార్‌పై పీకే నిప్పులు చెరిగారు. జేడీయూ-బీజేపీ పొత్తుతో బీహార్‌కు ఒరిగిందేంలేదన్నారు. నితీష్ ఒకవైపు గాంధీ సిద్ధాంతాలను బోధిస్తూ, మరోవైపు గాడ్సేను పూజించే వాళ్లతో ఎలా చేతులు కలుపుతారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. బీజేపీతో చేతులు కలిపిన తరువాత నితీష్ పూర్తిగా మారిపోయారన్నారు. నీతి అయోగ్ లెక్కల ప్రకారం దేశంలో వెనకబడిన రాష్ట్రం బీహారేనన్నారు.