వామ్మో అన్ని రూ. కోట్లా.. ? చూస్తే మీరు కూడా షాకవుతారు
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ కేపిటల్ సంస్థ కొనుగోలు చేసినట్టు బుధవారం తెలిపింది. దీనికి సంబంధించి రూ. 38,050 కోట్లను చెల్లించి ఈ ఒప్పందాన్ని పూర్తి చేసినట్టు పేర్కొంది. దీంతో ఆర్థిక రంగంలో విలువ పరంగా అతిపెద్ద డీల్‌గా నిలిచిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్‌లోని 94 శాతం రుణదాతలు పిరమల్ కేపిటల్‌కు విక్రయించేందుకు అనుకూలంగా ఓటు వేసిన తర్వాత ఈ కొనుగోలు జరిగింది. అనంతరం దీనికి రిజర్వ్ […]
దిశ, వెబ్‌డెస్క్: ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటున్న దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్(డీహెచ్ఎఫ్ఎల్)ను పిరమల్ కేపిటల్ సంస్థ కొనుగోలు చేసినట్టు బుధవారం తెలిపింది. దీనికి సంబంధించి రూ. 38,050 కోట్లను చెల్లించి ఈ ఒప్పందాన్ని పూర్తి చేసినట్టు పేర్కొంది. దీంతో ఆర్థిక రంగంలో విలువ పరంగా అతిపెద్ద డీల్‌గా నిలిచిందని పరిశ్రమ వర్గాలు భావిస్తున్నాయి. డీహెచ్ఎఫ్ఎల్‌లోని 94 శాతం రుణదాతలు పిరమల్ కేపిటల్‌కు విక్రయించేందుకు అనుకూలంగా ఓటు వేసిన తర్వాత ఈ కొనుగోలు జరిగింది.
అనంతరం దీనికి రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఆర్‌బీఐ), కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ), నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్(ఎన్‌సీఎల్‌టీ) నుంచి ఆమోదం లభించింది. ఇందులో రూ. 34,250 కోట్లను నగదు, నాన్ కన్వర్టుబుల్ డిబెంచర్ల రూపంలో పిరమల్ కేపిటల్ సంస్థ చెల్లించనుంది. రూ.3800 కోట్లను డీహెచ్ఎఫ్ఎల్ దగ్గరున్న నగదు ద్వారా అప్పులున్నవారికి, డిపాజిటర్లకు చెల్లించనున్నారు. కొనుగోలు ఒప్పందం ప్రకారం.. రూ. 34,250 కోట్ల చెల్లింపుల్లో రూ. 14,700 కోట్లను పూర్తిగా నగదు రూపంలో పిరమల్ గ్రూప్ ఇవ్వనుంది. మిగిలిన మొత్తాన్ని డెట్ ఇన్‌స్ట్రుమెంట్ల ద్వారా, రూ. 19,550 కోట్లను పదేళ్ల ఎన్‌సీడీలకు 6.75 శాతం వడ్డీతో చెల్లించేందుకు ఒప్పందం పూర్తయింది. ఈ వడ్డీ ప్రతి ఆరు నెలలకు ఒకసారి చెల్లించనున్నారు. ఈ కొనుగోలు ద్వారా పిరమల్ గ్రూప్ తన డిజిటల్ ఓరియెంటెడ్ ఆర్థిక సేవల విభాగంలో ముందుకెళ్లడానికి దోహదపడుతుందని సంస్థ చైర్మన్ అజయ్ పిరమల్ అన్నారు.